ప్రపంచకప్‌ తర్వాత కెరీర్‌పై నిర్ణయం: మెస్సీ  | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌ తర్వాత కెరీర్‌పై నిర్ణయం: మెస్సీ 

Published Tue, Jun 12 2018 1:03 AM

Lionel Messi to consider Argentina retirement after World Cup - Sakshi

రాబోయే ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌లో తమ జట్టు ప్రదర్శన ఆధారంగా తన కెరీర్‌పై ఓ నిర్ణయానికి వస్తానని అర్జెంటీనా కెప్టెన్, స్టార్‌ ఆటగాడు లియోనల్‌ మెస్సీ తెలిపాడు. ‘ప్రపంచకప్‌లో మేం ఎంత దూరం ప్రయాణిస్తాం, ఎలా ముగించనున్నాం అనేది ముఖ్యం. గత నాలుగేళ్ల కాలంలో మేము మూడు మెగా ఫైనల్స్‌లో ఓడిపోయాం.

ఈసారి  స్పెయిన్, బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియంలు  టైటిల్‌ ఫేవరెట్లు’ అని మెస్సీ విశ్లేషించాడు. ప్రపంచ కప్‌లో అర్జెంటీనా తమ తొలి మ్యాచ్‌ను శనివారం ఐస్‌లాండ్‌తో ఆడనుంది.  

Advertisement
Advertisement