హల్‌చల్‌ చేస్తున్న'లియోన్‌ కింగ్‌'

6 Aug, 2019 17:03 IST|Sakshi

బర్మింగ్‌హమ్‌ : యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా  ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టును ఆస్ట్రేలియా 251 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో నాథన్‌ లియోన్‌ మొత్తం 9వికెట్లతో(మొదటి ఇన్నింగ్స్‌ 3 , రెండో ఇన్నింగ్స్‌లో 6 ) వికెట్లతో ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించాడు. ఈ ఆస్ట్రేలియన్‌ స్పిన్నర్‌ విసిరిన పదునైన బంతులకు ఇంగ్లండ్‌ బ్యాట్సమెన్‌ దగ్గర సమాధానం లేకుండా పోయింది. అతని ప్రదర్శనకు అన్ని వైపుల నుంచి ప్రశంసలు ముంచెత్తాయి. కాగా, బిగ్‌బాష్‌ లీగ్‌ ఫ్రాంచైజీ 'సిడ్నీ సిక్సర్స్‌' మాత్రం లియోన్‌ను వినూత్న రీతిలో ప్రశంసించింది. లియోన్‌ ప్రదర్శనపై  ట్విటర్‌ వేదికగా ' ది లియోన్‌ కింగ్'  పేరుతో వీడియోను విడుదల చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సరిగ్గా నెల రోజుల క్రితం ఇదే వేదికలో ప్రపంచకప్‌ సందర్భంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో  ఆస్ట్రేలియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాగా మొదటి టెస్టులో విజయం సాధించడం ద్వారా ఆస్ట్రేలియా దానికి బదులు తీర్చుకుంది.   ఆస్ట్రేలియా విధించిన 398 పరుగుల లక్ష్యాన్ని నాథన్‌ లియోన్‌(6-49), పాట్‌ కమ్మిన్స్‌(4-32) ధాటికి ఇంగ్లండ్‌ 146 పరుగులకే చాప చుట్టేసింది.యాషెస్‌ సిరీస్‌ నుంచే ప్రారంభమైన ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా విజయంతో బోణీ చేసింది.

మరిన్ని వార్తలు