మారిన్ సిలిచ్ కు యూఎస్ ఓపెన్ టైటిల్ | Sakshi
Sakshi News home page

మారిన్ సిలిచ్ కు యూఎస్ ఓపెన్ టైటిల్

Published Tue, Sep 9 2014 4:50 AM

మారిన్ సిలిచ్ కు యూఎస్ ఓపెన్ టైటిల్ - Sakshi

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను క్రొయేషియాకు చెందిన 14వ సీడ్ ఆటగాడు మారిన్ సిలిచ్ గెలుచుకున్నాడు. అతడికిది తొలి గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో పదో సీడ్ కీ నిషికోరి (జపాన్)ను 6-3, 6-3, 6-3తో ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు.

సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను కంగుతినిపించిన నిషికోరి తుదిపోరులో పెద్దగా పోరాడకుండానే తలవంచాడు. 2005లో ఆస్ట్రేలియన్ ఓపెన్ (సఫిన్, హెవిట్) ఫైనల్ తర్వాత... ఫెడరర్, జొకోవిచ్, రాఫెల్ నాదల్‌లలో ఒక్కరూ లేకుండా గ్రాండ్‌స్లామ్ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. డోపింగ్‌లో పట్టుబడిన కారణంగా గతేడాది యూఎస్ ఓపెన్‌కు దూరంగా ఉన్న మారిన్ సిలిచ్ ఈసారి ఏకంగా విజేతగా అవతరించాడు.

Advertisement
Advertisement