నేపియర్ (మెక్లీన్ పార్క్) | Sakshi
Sakshi News home page

నేపియర్ (మెక్లీన్ పార్క్)

Published Wed, Feb 4 2015 1:02 AM

నేపియర్ (మెక్లీన్ పార్క్)

నాలుగు ప్రధాన స్టాండ్స్, ఒక వైపు పచ్చని గడ్డితో కూడిన స్టాండ్ మెక్లీన్ పార్క్‌కు ప్రధాన ఆకర్షణ. ఇందులో సీట్లు ఉండవు. కింద కూర్చొని మ్యాచ్‌లను తిలకిస్తారు. భారీ విస్తీర్ణంలో ఉండే ఈ మైదానంలో ఇండోర్ స్టేడియం, రోడ్నీ గ్రీన్ కాంటినెంటల్ ఈవెంట్ సెంటర్, నాలుగు కార్పొరేట్ లాంజ్‌లు, అద్భుతమైన సౌకర్యాలతో కూడిన 24 సూట్స్ ఉన్నాయి. ఎక్కువగా క్రికెట్, ఆ తర్వాత రగ్బీ మ్యాచ్‌లు జరుగుతాయి. అప్పుడప్పుడు అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తుంది.

స్టేడియం కెపాసిటీ 20 వేలు. హాక్స్ బే ప్రాంతంలో ఉన్న నేపియర్ మధ్యదరా వాతావరణ పరిస్థితులను కలిగి ఉంటుంది. దీన్ని కివీస్ ‘ఫుడ్ బౌల్’ అంటారు. ప్రపంచ స్థాయి వైనరీలు, వ్యవసాయ మార్కెట్లు, శిల్పాలు చెక్కినట్లుగా ఉండే వసతి సముదాయాలు ఈ నగరానికి పేరు తెస్తున్నాయి. 1931లో ఘోరమైన భూ కంపం తర్వాత నేపియర్‌ను పునర్ నిర్మించారు. కేప్ కల్చర్, నైట్ లైఫ్, షాపింగ్‌లకు ప్రసిద్ధి.
 

Advertisement
Advertisement