బ్యాడ్‌లక్... కొద్దిలో సెంచరీ మిస్‌!

25 Apr, 2017 12:58 IST|Sakshi
బ్యాడ్‌లక్... కొద్దిలో సెంచరీ మిస్‌!

జమైకా: చివరి టెస్ట్ సిరీస్‌ ఆడుతున్న పాకిస్థాన్ టెస్టు కెప్టెన్‌ మిస్బా-వుల్‌-హక్‌ను దురదృష్టం వెంటాడింది. టెస్టుల్లో 11 సెంచరీ ఒక్క పరుగు తేడాతో దూరమైంది. వెస్టిండీస్‌ తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌ లో పాకిస్తాన్ 407 పరుగులకు ఆలౌటైంది. మిస్బా ఒక్క పరుగు తేడాతో శతకం కోల్పోయాడు. 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి అండగా నిలిచే బ్యాట్స్ మన్‌ లేకపోవడంతో సెంచరీ చేయలేకపోయాడు. చివరి బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ అబ్బాస్‌ ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ కావడంతో శతకానికి ఒక్క దూరంలో మిస్బా నిలిచిపోయాడు. అయితే పాకిస్తాన్‌ ఇంకా రెండో ఇన్నింగ్స్‌ ఆడాల్సివుంది. విండీస్‌ మరో రెండు టెస్టులు కూడా ఆడనుంది.

కాగా, టెస్టుల్లో సెంచరీ దగ్గర ఆగిపోయిన పాకిస్తాన్ తొలి క్రికెటర్‌ గా మిస్బా గుర్తింపు పొందాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఈ విధంగా సెంచరీకి దూరమైన ఆరో బ్యాట్స్‌ మన్‌ గా నిలిచాడు. గతంలో జెఫ్రీ బాయ్‌కాట్‌, స్టీవ్‌ వా, అలెక్స్‌ టుడర్‌, షాన్‌ పొలాక్‌, ఆండ్రూ హాల్ ఇదేవిధంగా సెంచరీ చేజార్చుకున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు