తీవ్రంగా గాయపడ్డ స్టార్క్ | Sakshi
Sakshi News home page

తీవ్రంగా గాయపడ్డ స్టార్క్

Published Fri, Sep 16 2016 11:03 AM

తీవ్రంగా గాయపడ్డ స్టార్క్

సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. గురువారం సిడ్నీలో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో స్టార్క్  ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంతిని ఆపడానికి డైవ్ కొట్టడంతో అతని ఎడమ మోకాలుకు తీవ్ర గాయమైంది. దీంతో  ఫీల్డ్ లో విలవిల్లాడిన స్టార్క్ ను హుటాహుటీనా ప్రత్యేక అంబులెన్స్ లో సెయింట్ జార్జ్ ఆస్పత్రికి తరలించారు.  స్టార్క్ ఎడమకాలికి దాదాపు 30 కుట్లు పడినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా మెడికల్ చీఫ్ ఆఫీసర్ జాన్ ఆర్చడ్ తెలిపారు.

 

స్టార్క్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతన్ని మరికొన్ని రోజులు ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించనున్నట్లు ఆర్చడ్ పేర్కొన్నారు. స్టార్క్ కాలికి వేసిన కుట్లు తీయడానికి దాదాపు రెండు, మూడు వారాలు సమయం పట్టే అవకాశం ఉందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement