మిథాలీ రాజ్ కెరీర్లో తొలిసారి | Sakshi
Sakshi News home page

మిథాలీ రాజ్ కెరీర్లో తొలిసారి

Published Sun, Jul 9 2017 3:15 PM

మిథాలీ రాజ్ కెరీర్లో తొలిసారి

లీసెస్టర్‌:మరో 34 పరుగులు చేస్తే మహిళల వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డును సొంతం చేసుకోనున్న భారత కెప్టెన్ మిథాలీ రాజ్.. దానికంటే ముందు ఒక 'చెత్త' రికార్డును మూట గట్టుకుంది. మహిళల వన్డే వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన  మ్యాచ్ లో మిథాలీ రాజ్ తొలి బంతికే పెవిలియన్ చేరింది.  తాను ఎదుర్కొన్న మొదటి బంతికి అవుటై గోల్డెన్ గా నిష్ర్కమించింది. ఇలా గోల్డెన్ డక్ గా వెనుదిరిగడం మిథాలీ కెరీర్ లో తొలిసారి.  గతంలో ఎప్పుడూ మిథాలీ గోల్డెన్ డక్ గా నిష్ర్కమించ లేదు.

 

వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల్ని సాధించడానికి మిథాలీ రాజ్ స్వల్ప దూరంలో ఉంది. ప్రస్తుతం మిథాలీ రాజ్ (5959) రెండో స్థానంలో ఉండగా, షార్లెట్ ఎడ్వర్డ్స్(5992) తొలి స్థారంలో ఉంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కు ముందు అత్యధిక పరుగుల రికార్డును సైత అవలీలగా సాధిస్తుందని క్రికెట్ అభిమానులు ఎదురుచూశారు. ఇటీవల వన్డేల్లో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు సాధించి ఆ ఘనతను సొంతం చేసుకున్న మిథాలీ సొంతం చేసుకోవడంతో మరో రికార్డు ఖాయంగా కనబడింది. అయితే మిథాలీ గోల్డెన్ డక్ గా అవుటై నిరాశపరిచారు. భారత ఇన్నింగ్స్ లో భాగంగా 13 ఓవర్ లో మిథాలీ రాజ్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరింది. సఫారీ బౌలర్ వేన్ నీకెర్క్ వేసిన బంతికి మిథాలీ బౌల్డ్ గా నిష్ర్రమించింది. దాంతో కొత్త రికార్డును సృష్టించే అవకాశాన్ని చేజార్చుకున్న మిథాలీ.. ఒక 'చెత్త' రికార్డును మూట గట్టుకున్నారు.

Advertisement
Advertisement