భారత్ సెమీస్ ప్రత్యర్థి థాయ్‌లాండ్ | Sakshi
Sakshi News home page

భారత్ సెమీస్ ప్రత్యర్థి థాయ్‌లాండ్

Published Thu, Oct 20 2016 1:29 AM

Mix-rival India, Thailand

అహ్మదాబాద్: ప్రపంచకప్ కబడ్డీ టోర్నమెంట్ నాకౌట్ దశకు చేరుకుంది. బుధవారంతో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశారుు. గ్రూప్ ‘ఎ’ నుంచి దక్షిణ కొరియా, భారత్... గ్రూప్ ‘బి’ నుంచి థాయ్‌లాండ్, ఇరాన్ సెమీఫైనల్‌కు చేరుకున్నారుు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో కొరియాతో ఇరాన్; థాయ్‌లాండ్‌తో భారత్ తలపడతారుు. బుధవారం జరిగిన చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ 67-26తో అర్జెంటీనాపై విజయం సాధించి 16 పారుుంట్లతో గ్రూప్ ‘ఎ’లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక గ్రూప్ ‘బి’ కీలక మ్యాచ్‌లో థాయ్‌లాండ్ 37-33తో జపాన్‌ను ఓడించింది.

 

ఈ విజయంతో గ్రూప్ ‘బి’లో థాయ్‌లాండ్, ఇరాన్ 20 పారుుంట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారుు. అరుుతే మెరుగైన పారుుంట్ల సగటు (సాధించిన పారుుంట్లు, కోల్పోరుున పారుుంట్ల మధ్య తేడా) ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... థాయ్‌లాండ్ (+82)కు టాప్ ర్యాంక్ దక్కింది. ఇరాన్ (+71) రెండో స్థానంలో నిలిచింది. జపాన్ చేతిలో కనీసం ఏడు పారుుంట్ల తేడాతో ఓడిపోకుంటే సెమీస్‌కు చేరుకునే పరిస్థితిలో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ ఈ సమీకరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడింది. రెండో అర్ధభాగంలో ఒకదశలో థాయ్‌లాండ్ 26-31తో వెనుకబడింది. అరుుతే చివరి ఐదు నిమిషాల్లో థాయ్‌లాండ్ అద్భుతంగా ఆడి... విజయం సాధించి అగ్రస్థానం దక్కించుకుంది.

Advertisement
Advertisement