నా కల నెరవేరింది : స్టార్ క్రికెటర్ | Sakshi
Sakshi News home page

నా కల నెరవేరింది : స్టార్ క్రికెటర్

Published Thu, Aug 4 2016 10:54 AM

Moments like these make you feel grateful, says virat kohli


భారత స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లి తన కల నెరవేరిందని చాలా సంతోషంగా ఉన్నాడు. తన సంతోషాన్ని అభిమానులతో కూడా పంచుకోవాలని భావించిన క్రికెటర్ కోహ్లీ తన ఆనందక్షణాలను ట్విట్ చేశాడు. ప్రస్తుతం టీమిండియాలోనే కీలక ఆటగాడు, టెస్ట్ జట్టుకు కెప్టెన్గానూ సేవలు అందిస్తున్నాడు విరాట్. అయితే పదేళ్ల కిందట తోటి క్రికెటర్లతో కలిసి తన ఆరాధ్యుడు రాహుల్ ద్రావిడ్తో  ఓ ఫొటో దిగాడు.

అప్పట్లో మిస్టర్ డిపెండబుల్ ద్రావిడ్ను చూస్తే చాలని విరాట్ భావించేవాడు. కానీ నేడు పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది. ఇప్పుడు స్టార్ క్రికెటర్ హోదాలో దిగ్గజాలతో కలిసి వేడుకలలో పాల్గొనడం, పార్టీలు, విహారయాత్రలు చేస్తున్నాడు. ఒకసారి ఈ ఫొటో గమనిస్తే... పదేళ్ల కిందట దిగిన ఫొటోలో విరాట్ తన అభిమాన క్రికెటర్ ద్రావిడ్నే చూస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ద్రవిడ్ను చూస్తే చాలనుకున్న తనను నేడు ద్రావిడ్ స్వయంగా ఇంటర్వ్యూ చేశాడంటూ హర్షం వ్యక్తంచేస్తూ ట్వీట్ చేశాడు. మనం అనుకున్నవాటి కంటే ఎక్కువ సాధించినప్పుడు చాలా గర్వంగా ఉంటుందని కోహ్లీ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement