ధోని ఖాతాలో మరో రికార్డు

28 May, 2018 15:40 IST|Sakshi

ముంబై: ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభంలో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన  కెప్టెన్‌గా రికార్డులకెక్కిన ఎంఎస్‌ ధోని.. సన్‌రైజర్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డును నెలకొల్పాడు. కరణ్‌ శర్మ బౌలింగ్‌లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను స్టంపౌట్ చేయడం ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్టంపౌట్లు చేసిన వికెట్ కీపర్‌గా ధోని రికార్డు నెలకొల్పాడు.

ఇది ధోనికి ఓవరాల్‌ ఐపీఎల్‌లో 33 స్టంపింగ్. ఫలితంగా ఐపీఎల్‌లో అత్యధిక స్టంపింగ్‌ జాబితాలో ఇప్పటివరకూ అగ్రస్థానంలో ఉన్న రాబిన్‌ ఉతప్ప(32)ను ధోని అధిగమించాడు. ఆ తర్వాత స్థానాల్లో దినేష్ కార్తీక్(30), సాహా(18)లు ఉన్నారు. రెండేళ్ల నిషేధం తర్వాత రంగంలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ పునరాగమనాన్ని ఘనంగా చాటింది. అసాధారణ ఆటతీరుతో ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఆదివారం ముంబైలో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు