నువ్వు బహుమతులకు లొంగని వ్యక్తివి: సాక్షి ధోని

7 Jul, 2020 14:51 IST|Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని మంగళవారం(జూలై7) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈరోజుతో ధోని 40వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా క్రీడాకారులతోపాటు కోట్లాది మంది అభిమానులు ధోనికి బర్త్‌డే విషెస్‌ వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో ధోని బర్త్‌డే సందర్భంగా స్పెషల్‌ వీడియోను రూపొందించాడు. ధోని ఘనతలు, గొప్పతనాన్ని కీర్తిస్తూ 'ఎంఎస్ ధోని నెంబర్ 7​' పేరిట బ్రావో ఆ పాటను ఈ రోజు రిలీజ్ చేసాడు. దీంతో  ధోనిపై ఉన్న తన ప్రేమని బ్రావో చాటుకున్నాడు. (ధోని ఆంతర్యం ఏమిటో ?)

కాగా ఎంఎస్‌ ధోని భార్య సాక్షి ధోని తన భర్త కోసం ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్టు పెట్టారు. ‘నీ పుట్టిన రోజును గుర్తుకుచేసుకుంటూ ఒక ఏడాది గడిచిపోయింది. కొంచెం వయసు పెరిగింది. ఇంకొంచెం తెలివిగా, మరింత తియ్యగా మారాల్సిన సమయం వచ్చింది. నువ్వు ఎలాంటి వ్యక్తివి అంటే బహుమతులకు లొంగని వ్యక్తివి. కేక్‌ కట్‌ చేసి, క్యాండిల్స్‌ వెలిగించి నీ జీవితంలోని మరో ఏడాదిని సెలబ్రేట్‌ చేసుకుందాం. హ్యపీ బర్త్‌డే హస్బెండ్’‌ అంటూ విష్‌ చేశారు. (టి20 ప్రపంచకప్‌ వాయిదా?) 

Marking the date you were born, another year older, greyed a bit more, become smarter and sweeter. (Literally 😂😂) You are a man who will not be moved by all the sweet wishes and gifts. Let’s celebrate another year of your life by cutting a cake and blowing the candles! Happy Birthday, Husband!!

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

ధోని జార్ఖండ్‌లోని రాంచీలో 1981, జూలై7న జన్మించాడు. 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో టీమిండియా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. మూడేళ్లకే 2007లో జరిగిన మొదటి టీ20 ప్రపంచకప్‌తో ధోని టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ టోర్నీలో భారత్‌ను విజేతగా నిలిపాడు. అంతేగాక 2011లో వన్డే ప్రపంచకప్‌ను అందించాడు. ఐసీసీ నిర్వహించే వన్డే వరల్డ్‌కప్‌, చాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్‌ గెలుచుకున్న మొదటి కెప్టెన్ గా ధోని రికార్డు సృష్టించాడు. ఇక 2014లో టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ధోని, 2017లో టీ 20, వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ జరిగిన తర్వాత నుంచి ధోని భారత జట్టు తరఫున ఆడలేదు. దాంతో అతని రిటైర్మెంట్‌పై రకరకాలు కథనాలు వస్తూనే ఉన్నాయి (ఐపీఎల్‌ ఆతిథ్యానికి మేము సిద్ధం: న్యూజిలాండ్‌)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా