టీమిండియా సెలెక్టర్ గా ఎమ్మెస్కే ప్రసాద్ | Sakshi
Sakshi News home page

టీమిండియా సెలెక్టర్ గా ఎమ్మెస్కే ప్రసాద్

Published Mon, Nov 9 2015 1:32 PM

టీమిండియా సెలెక్టర్ గా ఎమ్మెస్కే ప్రసాద్

ముంబై: తెలుగువాడైన మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ భారత జట్టు జాతీయ సెలెక్టర్ గా ఎంపికయ్యాడు. శశాంక్ మనోహర్ అధ్యక్షతన సోమవారం జరిగిన బీసీసీఐ వార్షిక సభ్య సమావేశం (ఏజీఎం)లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత జట్టు సెలెక్టర్లుగా ఉన్న రోజర్ బిన్నీ, రాజేందర్ సింగ్ లకు ఉద్వాసన పలికారు. వీరి స్థానంలో సౌత్ జోన్ నుంచి ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడాలను నియమించారు.

దీంతో ఆంధ్రా నుంచి జాతీయ సెలెక్టర్ గా ఎంపికైన తొలి క్రికెటర్ గా ప్రసాద్ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆయన ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. 6 టెస్టులు, 17 వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1999-2000లో ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా తరపున అతడు ఆడాడు.

టీమిండియా డైరెక్టర్ గా ఉన్న రవిశాస్త్రిని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి తొలగించారు. గవర్నింగ్ సభ్యుల సంఖ్య 5కు కుదించారు. రాజీవ్ శుక్లాను ఐపీఎల్ చైర్మన్ గా కొనసాగించాలని నిర్ణయించారు. బీసీసీఐ టెక్నికల్ కమిటీ చైర్మన్ గా అనిల్ కుంబ్లీ స్థానంలో గంగూలీని నియమించారు. విశాఖపట్నం, రాంచీ, ఇండోర్, పుణే, రాజ్ కోట్ స్టేడియాలను టెస్టు మ్యాచ్ లకు కొత్త వేదికలుగా ఎంపిక చేశారు.


 

Advertisement
Advertisement