సైకిల్‌ దొంగతనమే అలీని బాక్సర్‌ను చేసింది | Sakshi
Sakshi News home page

సైకిల్‌ దొంగతనమే అలీని బాక్సర్‌ను చేసింది

Published Sat, Jun 4 2016 8:02 PM

సైకిల్‌ దొంగతనమే అలీని బాక్సర్‌ను చేసింది

కెంటకీ: సాధారణ స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగిన అసాధారణ వ్యక్తుల జీవితాల్లో ఏదో ఒక కీలక మలుపు ఉంటుంది. అదే వారిని జీవిత లక్ష్య సాధనవైపు నడిపిస్తుంది. అలాగే ప్రపంచ బాక్సింగ్‌ దిగ్గజం మొహమ్మద్‌ అలీ జీవితంలోనూ ఓ కీలక మలుపు ఉంది. ఆ మలుపే ఆయన్ని బాక్సింగ్‌వైపు నడిపించి ప్రపంచ మేటి బాక్సింగ్‌ ఛాంపియన్‌ను చేసింది.

12 ఏళ్ల వయస్సులో 1954లో ఓ రోజు మొహమ్మద్‌ అలీ సైకిల్‌ను ఓ గుర్తు తెలియని దొంగ ఎత్తుకుపోయాడు. ఈ విషయాన్ని ఆయన పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఆ దొంగపై తాను ఎలాగైనా ప్రతీకారం తీసుకుంటానని పోలీసు ముందు శపథం చేశారు. అందుకు ముందుగా బాక్సింగ్‌ నేర్చుకోవాల్సిందిగా అలీకి ఆ పోలీసు సలహా ఇచ్చారు. ఆ సలహాను సీరియస్‌గా తీసుకున్న అలీ ముందుగా కండలు పెంచేందుకు జిమ్ లో చేరారు. ఆ తర్వాత బాక్సింగ్‌ నేర్చుకున్నారు. అదే పట్టుదలతో బాక్సింగ్‌ దిగ్గజంగా జీవితంలో రాణించారు.

మొహమ్మద్‌ అలీ చిన్నప్పటి పేరు కాసియస్‌ మర్సలెస్‌ క్లే జూనియర్‌. 19వ శతాబ్దంలో అమెరికాలో బానిసత్వాన్ని రూపుమాపిన మర్సలెస్‌ పేరునే ఆయన తల్లిదండ్రులు పెట్టారు. అయితే వియత్నాంపై అమెరికా యుద్ధం ప్రారంభించడాన్ని నిరసిస్తూ తన పేరును మొహమ్మద్‌ అలీగా మార్చుకున్నారు. కేథలిక్‌ మతాన్ని వదిలేసి ముస్లిం మతాన్ని స్వీకరించారు.

 

Advertisement
Advertisement