జెర్సీకీ ‘రిటైర్మెంట్’! | Sakshi
Sakshi News home page

జెర్సీకీ ‘రిటైర్మెంట్’!

Published Sun, Oct 13 2013 1:33 AM

Mumbai Indians retires No. 10 jersey

ముంబై: క్రికెట్‌లో పదో నెంబర్ జెర్సీ అంటే గుర్తొచ్చేది సచిన్ పేరే. భారత్ జట్టుతో పాటు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున కూడా మాస్టర్ పదో నంబర్ జెర్సీతో ఆడాడు. ఈ నంబర్ సచిన్‌కు మాత్రమే ఉండాలని, తమ జట్టులో మరే ఆటగాడికీ ఈ నంబర్‌ను కేటాయించకూడదని ముంబై ఇండియన్స్ యాజమాన్యం నిర్ణయించింది.
 
 దీంతో ముంబై పదో నంబర్ జెర్సీకి కూడా ‘రిటైర్మెంట్’ ప్రకటించినట్లయింది. ‘సచిన్ వైదొలగడం మాకు భావోద్వేగంతో కూడుకున్న అంశం. అతడికి గౌరవంగా పదో నంబర్ జెర్సీని ‘రిటైర్’ చేస్తున్నాం’ అని ముంబై జట్టు యజమాని నీతా అంబానీ తెలిపారు.
 

Advertisement
Advertisement