'నన్ను క్రికెటర్గా చూడాలనుకున్నారు' | Sakshi
Sakshi News home page

'నన్ను క్రికెటర్గా చూడాలనుకున్నారు'

Published Mon, Jul 18 2016 12:48 PM

'నన్ను క్రికెటర్గా చూడాలనుకున్నారు'

ముంబై:తన తండ్రి సలీమ్ ఖాన్ తనను క్రికెటర్ గా చూడాలనున్నారని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా స్పష్టం చేశాడు. అందుకోసం తనకు ఓ కోచ్ను ఏర్పాటు ప్రత్యేక్ష శిక్షణ ఇప్పించేవారన్నాడు. అయితే తనకు క్రికెటర్ కావడం పెద్దగా ఇష్టం ఉండేది కాదన్నాడు. ప్రతీరోజూ ఉదయాన్నే లేచి ప్రాక్టీస్ వెళ్లడం తన వల్ల కాలేకపోవడం వల్లే క్రికెట్ను పక్కకు పెట్టానన్నాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటోబయోగ్రఫీ ' ఏస్ అగనెస్ట్ ఆడ్స్'  పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన సల్మాన్ తన చిన్ననాటి జ్ఞాపకాల్ని నెమరవేసుకున్నాడు.

'నేను క్రికెటర్ని కాబోయి యాక్టర్ను అయ్యా. నేను స్కూల్ డేస్లో క్రికెట్ చాలా బాగా ఆడేవాణ్ని. దాంతో మా నాన్న గారు నాపై ఆశలు పెంచుకున్నారు. నాకోసం ప్రత్యేకంగా ఒక కోచ్ను ఏర్పాటు చేశారు. నాకు మంచి భవిష్యత్ ఉందని కోచ్ చెప్పడంతో మా నాన్నగారు కోరిక మరింత బలపడింది. అయితే నాకు క్రికెట్ అంటే ఇష్టముండేది కాదు. పొద్దున్నే లేచి ప్రాక్టీస్ కు వెళ్లడమండే నాకు సాధ్యం కాని పని. అందుచేత సాధారణ రోజుల్లో బాగా క్రికెట్ ఆడినా, నా ఆటను మా నాన్నగారు చూడటానికి వచ్చినప్పడు కావాలనే బాగా ఆడేవాణ్ని కాదు. అలా మా నాన్నగారి దృష్టి మళ్లించే యత్నం చేసేవాడిని' అని సల్మాన్ తెలిపాడు.

Advertisement
Advertisement