నా ప్రాక్టీస్‌కు నాన్న సాయం: సాహా  | Sakshi
Sakshi News home page

నా ప్రాక్టీస్‌కు నాన్న సాయం: సాహా 

Published Fri, Jun 5 2020 12:05 AM

My Father Helped Me In Practice Session Says Wriddhiman Saha - Sakshi

కోల్‌కతా: దాదాపు రెండు నెలలుగా ప్రాక్టీస్‌కు దూరమైన భారత టెస్టు జట్టు వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా తమ నివాస స్థలంలోనే సాధనను కొనసాగిస్తున్నట్లు చెప్పాడు. తను ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో తండ్రి సాయంతో వికెట్‌ కీపింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నానన్నాడు. ‘మా ఫ్లాట్‌లో ఖాళీగా ఉన్న స్థలాన్ని సన్నాహకానికి ఉపయోగించుకుంటున్నా. సాఫ్ట్‌ బాల్‌తో క్యాచ్‌లు పడుతున్నా. బంతిని గోడకేసి కొట్టి... క్యాచ్‌లుగా పట్టేందుకు శ్రమిస్తున్నా. దీనికి మా నాన్న ప్రశాంత సాహా సాయమందిస్తున్నారు. నేను చేసే ప్రాక్టీస్‌కు ఈ స్థలం, మా నాన్న సాయం సరిపోతుంది. అటు ఇటు కీపింగ్‌ క్యాచింగ్‌ చేస్తున్నాను. లాక్‌డౌన్‌తో బయటికి వెళ్లకుండానే  కీపింగ్‌ డ్రిల్స్‌ చేస్తున్నాను. రన్నింగ్‌కు వీల్లేకపోయినా అపార్ట్‌మెంట్‌ లోపలే వాకింగ్‌తో సరిపెట్టుకున్నాను. పూర్తిస్థాయి జిమ్‌ లేదు కానీ అందుబాటులోని ఎక్సర్‌సైజ్‌ సామాగ్రితో రోజు కసరత్తు చేస్తున్నా’ అని సాహా చెప్పాడు.

Advertisement
Advertisement