టోక్యో ఒలింపిక్స్‌కు నీరజ్‌ చోప్రా అర్హత | Sakshi
Sakshi News home page

టోక్యో ఒలింపిక్స్‌కు నీరజ్‌ చోప్రా అర్హత

Published Thu, Jan 30 2020 1:55 AM

Neeraj Chopra Qualifies For Tokyo Olympics - Sakshi

పాచెఫ్‌స్ట్రూమ్: భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఏసీఎన్‌ఈ లీగ్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో పాల్తొన్న 22 ఏళ్ల నీరజ్‌ చోప్రా స్వర్ణ పతకం సాధించడంతోపాటు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందాడు. మోచేతి గాయం కారణంగా 2019 సీజన్‌ మొత్తానికి దూరంగా ఉన్న అతను గాయం నుంచి కోలుకొని ఏసీఎన్‌ఈ లీగ్‌ మీట్‌లో పాల్గొన్నాడు. హరియాణాకు చెందిన నీరజ్‌ ఈటెను 87.86 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్‌ అర్హత ప్రమాణమైన 85 మీటర్లను అతను అధిగమించాడు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement