కివీస్‌దే సిరీస్ | Sakshi
Sakshi News home page

కివీస్‌దే సిరీస్

Published Wed, Jul 2 2014 1:28 AM

New Zealand beat West Indies to win Test series 2-1

బ్రిడ్జ్‌టౌన్: వెస్టిండీస్ గడ్డపై న్యూజిలాండ్ జట్టు మరో సారి సత్తా చాటింది. సోమవారం ఇక్కడ ముగిసిన మూడో టెస్టులో కివీస్ 53 పరుగుల తేడాతో విండీస్‌ను ఓడించింది. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్టు కివీస్ నెగ్గగా, రెండో టెస్టులో వెస్టిండీస్ విజయం సాధించింది.
 
  2002లో ఇక్కడే విండీస్‌పై సిరీస్ విజయం సాధించిన న్యూజిలాండ్... ఆ తర్వాత విదేశాల్లో ఒక పెద్ద జట్టుపై మళ్లీ సిరీస్ నెగ్గడం ఇప్పుడే మూడో టెస్టులో మ్యాచ్ చివరి రోజు సోమవారం 308 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 254 పరుగులకు ఆలౌటైంది. తొలి టెస్టు ఆడుతున్న జాసన్ హోల్డర్ (52) అర్ధ సెంచరీ చేయగా, డారెన్ బ్రేవో (40) రాణించాడు. కివీస్ బౌలర్లలో సౌతీ, బౌల్ట్, క్రెయిగ్ తలా 3 వికెట్లు తీశారు. విలియమ్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు లభించాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement