ఓపెనర్లు 'గోల్డెన్ డక్' | Sakshi
Sakshi News home page

ఓపెనర్లు 'గోల్డెన్ డక్'

Published Tue, Aug 30 2016 3:35 PM

ఓపెనర్లు 'గోల్డెన్ డక్'

సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టులో న్యూజిలాండ్ విలవిల్లాడుతోంది. దక్షిణాఫ్రికా విసిరిన 400 పరుగుల లక్ష్యంతో నాల్గో రోజు బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్ ఏడు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. న్యూజిలాండ్ ఓపెనర్లు లాథమ్, గప్టిల్లు గోల్డెన్ డకౌట్లుగా పెవిలియన్ చేరారు. ఇలా ఓపెనర్లిద్దరూ ఒక బౌలర్ వేసిన వేర్వేరు  ఓవర్లలో తొలి బంతికే వెనుదిరగడం 1982 తరువాత ఇదే తొలిసారి.

 

ఆ పై సెకెండ్ డౌన్లో వచ్చిన రాస్ టేలర్ కూడా డకౌట్గా అవుటవ్వగా, కెప్టెన్ విలియమ్సన్(5) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో న్యూజిలాండ్ ఏడు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో తొలి మూడు వికెట్లను డేల్ స్టెయిన్ తీయగా, నాల్గో వికెట్ ఫిలిండర్ ఖాతాలో చేరింది.


అంతకుముందు దక్షిణాఫ్రికా ఏడు వికెట్లకు 132 పరుగులు చేసిన అనంతరం తన సెకెండ్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని దక్షిణాఫ్రికాకు భారీ ఆధిక్యం లభించింది. న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 214 పరుగులకే పరిమితమైన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement