వరల్డ్ టైటిల్ దిశగా.. | Sakshi
Sakshi News home page

వరల్డ్ టైటిల్ దిశగా..

Published Sun, Oct 9 2016 12:53 PM

వరల్డ్ టైటిల్ దిశగా..

సుజుకా(జపాన్): ఇప్పటికే ఈ సీజన్  ఫార్ములావన్ గ్రాండ్ ప్రిలో  అత్యధిక విజయాలతో దూసుకుపోతున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్ బర్గ్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని వరల్డ్ టైటిల్ దిశగా సాగుతున్నాడు. జపాన్ గ్రాండ్ ప్రి ప్రధాన రేసులో రోస్ బర్గ్ విజేతగా నిలవడంతో తన పాయింట్ల సంఖ్యను మరింత పెంచుకున్నాడు. ఆదివారం జరిగిన  ప్రధాన రేసును పోల్ పొజిషన్ నుంచి ఆరంభించిన రోస్ బర్గ్ ఆద్యంతం ఆకట్టుకుంటూ అగ్రస్థానంలో నిలిచాడు.

 

ఈ 53 ల్యాప్ లను రేసును రోస్ బర్గ్ అందరి కంటే వేగంగా పూర్తి చేయగా, మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అయితే రెడ్ బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ రెండో స్థానంతో మెరిశాడు. ఈ తాజా విజయంతో రోస్ బర్గ్ తన పాయింట్లను మరింత పెంచుకుని హామిల్టన్ ను వెనక్కునెట్టాడు. గత ఐదు రేసుల్లో రోస్ బర్గ్ నాలుగింటిలో విజయం సాధించడం విశేషం. ప్రస్తుతం రోస్ బర్గ్  313 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, హామిల్టన్ 280 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

 

ఇప్పటివరకూ జరిగిన 17 ఫార్ములా వన్ గ్రాండ్ ప్రి రేసులో రోస్ బర్గ్ తొమ్మిందిటిలో విజయం సాధించగా, హామిల్టన్ ఆరింటిలో గెలిచాడు. ఇంకా నాలుగు రేసులో మిగిలి ఉండటంతో రోస్ బర్గ్ తొలి వరల్డ్ టైటిల్ ను సాధించేందుకు స్వల్ప దూరంలో నిలిచాడు. ఇక మిగిలిన నాలుగు రేసుల్లో ఒకదాంట్లో గెలిచినా రోస్ బర్గ్ ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్‌షిప్ ను కైవసం చేసుకుంటాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement