శతక్కొట్టిన నితిన్‌ | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన నితిన్‌

Published Mon, Sep 11 2017 10:57 AM

శతక్కొట్టిన నితిన్‌

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఇంటర్‌ స్కూల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో భవన్స్‌ శ్రీ అరబిందో బ్యాట్స్‌మన్‌ ఎ. నితిన్‌ (170 బంతుల్లో 175; 20 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. దీంతో సెయింట్‌ మార్క్స్‌ బాయ్స్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో భవన్స్‌ శ్రీ అరబిందో జట్టు ఘనవిజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 192 పరుగులతో బాయ్స్‌టౌన్‌ను ఓడించింది.

 

మొదట బ్యాటింగ్‌ చేసిన భవన్స్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 308 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం సెయింట్‌ మార్క్స్‌ బాయ్స్‌టౌన్‌ 35.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. ఇమామ్‌ షరీఫ్‌ (50) అర్ధసెంచరీ చేశాడు. ప్రత్యర్థి బౌలర్లలో ప్రజ్వల్‌ రాజ్‌ 4 వికెట్లు దక్కించుకున్నాడు.  

ఇతర మ్యాచ్‌ల ఫలితాలు

ఫ్రోబెల్స్‌: 195 (విశాల్‌ 45; తరుణ్‌ 3/34), నారాయణ కాన్సెప్ట్‌ స్కూల్‌: 140 (చేతన్‌ 70; శ్రీకర్‌ 4/42).  
సుజాత హైస్కూల్‌: 220 (అచ్యుత్‌ రామ్‌ 56; శశి కుమార్‌ 3/45), సెయింట్‌ ప్యాట్రిక్స్‌ హైస్కూల్‌: 221/6 (సోమన్‌ సాత్విక్‌ 71, శశి కుమార్‌ 63).
లయోలా జూనియర్‌ కాలేజ్‌: 94 (యశ్వంత్‌ 5/12), హెచ్‌పీఎస్‌: 96/7 (యోగేశ్‌ భటి 4/30, కుశాల్‌ 3/38).
ఆల్‌సెయింట్స్‌: 230 (పి. శివ 39, జఫరుల్లా ఖాన్‌ 114; సుమిత్‌ ఓజా 4/68, రోహిత్‌ 3/32), వెస్లీ జూనియర్‌ కాలేజ్‌: 234/9 (సాయి వినయ్‌ 64, వైష్ణవ్‌ రెడ్డి 52; పి. శివ 4/31).  

సాక్రెడ్‌ హార్ట్స్‌ హైస్కూల్‌ 240 (మెల్విన్‌ 64; శివ 4/58), జాన్సన్‌ గ్రామర్‌ స్కూల్‌: 110 (శశి 30; సయ్యద్‌ 3/19).  
సెయింట్‌ మోజెస్‌ హైస్కూల్‌: 166 (జితేంద్ర 43; జి. రోహిత్‌ 3/35, రాజ సింహా 4/31), జెనెసిస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌: 128 (మణికంఠ 3/32, సాకేత్‌ 3/24).
శ్రీనిధి ఇంటర్నేషనల్‌ స్కూల్‌: 313/8 (రోహిత్‌ రెడ్డి 63, వివేక్‌ 63, సాయితేజ 52; సాయి శ్రుతీశ్‌ 4/56), సెయింట్‌ జోసెఫ్‌ హైస్కూల్‌: 114/6 (కిర్‌స్టీ 49 నాటౌట్‌).  
గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌: 98 (కె. జగదీశ్‌ 30; సూరజ్‌ పటేల్‌ 4/14, తిలక్‌ రెడ్డి 3/33), నీలకంఠ విద్యాపీఠ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌: 100/7 (తిలక్‌ రెడ్డి 34; రణ్‌ధీర్‌ 3/15).
సుల్తాన్‌ ఉలూమ్‌: 91 (రాహుల్‌ కుమార్‌ 30, ప్రకాశ్‌ 3/21, ఉదయ్‌ కిరణ్‌ 4/17), మెలూహా ఇంటర్నేషనల్‌ స్కూల్‌: 92/1 (ఆర్‌. కీర్తన్‌ 31, ఉదయ్‌కిరణ్‌ 37).

 

Advertisement
Advertisement