నా బ్యాటింగ్ లో చాలా ప్రయోగాలు చేశారు..కానీ! | Sakshi
Sakshi News home page

నా బ్యాటింగ్ లో చాలా ప్రయోగాలు చేశారు..కానీ!

Published Sat, Feb 21 2015 4:45 PM

నా బ్యాటింగ్ లో చాలా ప్రయోగాలు చేశారు..కానీ!

మెల్ బోర్న్:విరాట్ కోహ్లీ.. టీమిండియా ఆశాకిరణం. వరల్డ్ కప్ లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన టీమిండియా జట్టులో కోహ్లీ మెరుగైన ఆటగాడే కాదు.. ఒక గొప్ప మ్యాచ్ ఫినిషర్. ఈ వరల్డ్ కప్ లో ఆరంగేట్రం మ్యాచ్ లో పాకిస్థాన్ పై సెంచరీ చేసి విరాట్ మరోసారి వార్తలో నిలిచాడు. అయితే కోహ్లీకి మూడో నంబర్ లో బ్యాటింగ్ చేయడమంటే ఇష్టమట. అంతకుముందు తన బ్యాటింగ్ ఆర్డర్ లో చాలా ప్రయోగాలు చేసినా.. మూడో స్థానమైతే తనకు సరిగ్గా సరిపోతుందని విరాట్ తెలిపాడు. ఈ విషయంపై జట్టు మేనేజ్ మెంట్ కు స్పష్టత రావడంతో ఈ వరల్డ్ కప్ లో తనతో థర్డ్ డౌన్ లో బ్యాటింగ్ దింపాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.

 

'నేను గతంలో  వివిధ రకాలైన ఆర్డర్ లో బ్యాటింగ్ చేశా.  ఏ స్థానంలో సరిపోతాను అనే దానిపై రకరకాల కాంబినేషన్ లో ప్రయోగించారు. కానీ  నేను కొన్ని సంవత్సరాల నుంచి మూడో నంబర్ లో రాణిస్తున్నాను' అని కోహ్లీ తెలిపాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ కు టీమిండియా సన్నద్ధమైన నేపథ్యంలో కోహ్లీ మీడియాతో ముచ్చటించాడు. తాము కొన్ని ప్రయోగాలు చేస్తుంటామని.. అందుకు అభిమానుల నుంచి సహకారం కావాలన్నాడు. ఈ క్రమంలోనే చాలా తప్పులు జరుగుతుంటాయని.. వాటి నుంచి మరికొన్ని విషయాలు నేర్చుకుని ముందుకు వెళుతుంటామని కోహ్లీ తెలిపాడు.

Advertisement
Advertisement