భారత క్రికెటర్లు లేకుండా వరల్డ్‌ ఎలెవన్‌ జట్టా..? | Sakshi
Sakshi News home page

భారత క్రికెటర్లు లేకుండా వరల్డ్‌ ఎలెవన్‌ జట్టా..?

Published Wed, Sep 13 2017 1:27 PM

భారత క్రికెటర్లు లేకుండా వరల్డ్‌ ఎలెవన్‌ జట్టా..?

సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచ అత్యత్తుమ ఆటగాళ్లైన భారత క్రికెటర్లు లేకుండా వరల్డ్‌ ఎలెవన్‌ జట్టే లేదని మాజీ ఐసీసీ ప్రెసిడెంట్‌ ఎహ్సాన్ మణి అభిప్రాయపడ్డారు. జట్టులో భారత క్రికెటర్లు లేకపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచిందన్నారు. భారత్‌ ఆసీసీతో లిమిటెడ్‌ ఓవర్ల సిరీస్‌ ఆడుతుందని తెలుసు కానీ ఈ సిరీస్‌లో ఆడని ప్లేయర్లను వరల్డ్‌ ఎలెవన్‌ జట్టులో భాగస్వామ్యులు చేయవచ్చని ఈషాన్‌ వ్యాఖ్యానించారు. క్రికెట్‌ దేశాల మధ్య బంధాన్ని బలపరుస్తుందన్నారు.
 
‘భారత్‌-పాక్‌లు అంతర్జాతీయ వేదికలపై అనేక మ్యాచ్‌లు ఆడుతాయి కానీ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడవు. ఇరు దేశాల మధ్య వ్యాపారా లావాదేవీలు కూడా జరుగుతాయి. కానీ క్రికెట్‌ విషయం కొచ్చే సరికి రాజకీయాలు ప్రస్తావిస్తారు. ఇరు దేశాలు క్రికెట్‌ను రాజకీయాలు వాడుకుంటున్నాయి. ఇది చాల తప్పు’ అని ఎహ్సాన్ మణి పేర్కొన్నారు. భద్రతా కారాణాల దృష్ట్యా పాక్‌లో క్రికెట్‌ ఆడకపోవడం దారుణమని, ప్రమాదాలు అన్ని దేశాల్లో సంభవిస్తాయన్నారు. ఎలాంటి ముప్పు లేకున్నా పాక్‌, వరల్డ్‌ ఎలెవన్‌ జట్టుకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేసిందని, అంత భద్రతా అవసరం కూడా లేదని అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్‌కు అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించే సామర్థ్యం ఉందని ఈ ఐసీసీ మాజీ ప్రెసిడెంట్‌ చెప్పుకొచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement