యూఎస్ ఓపెన్ విజేత జొకోవిచ్ | Sakshi
Sakshi News home page

యూఎస్ ఓపెన్ విజేత జొకోవిచ్

Published Mon, Sep 14 2015 8:23 AM

యూఎస్ ఓపెన్ విజేత జొకోవిచ్

న్యూయార్క్: ప్రపంచ నంబర్ వన్ నోవాక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. సెర్బియా స్టార్ రెండో ర్యాంకర్ రోజర్ ఫెడరర్కు మరోసారి షాకిచ్చి ఈ ఏడాది తన ఖాతాలో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ సమరంలో జొకోవిచ్ 6-4, 5-7,6-4, 6-4 స్కోరుతో ఫెడరర్పై విజయం సాధించాడు. ఫెడరర్తో 21-21  ముఖాముఖి రికార్డును సమం చేశాడు.

ఈ ఏడాది అద్భుత ఫామ్లో ఉన్న జొకోవిచ్ నాలుగు సెట్లలో మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. యూఎస్ ఓపెన్లో జొకోవిచ్కిది రెండో టైటిల్ కాగా.. ఓవరాల్గా తన కెరీర్లో పదో గ్రాండ్స్లామ్ టైటిల్. ఐదేళ్ల నిరీక్షణ తర్వాత యూఎస్ ఓపెన్‌ ఫైనల్ చేరిన ఫెడరర్ టైటిల్ సాధించలేకపోయాడు.

Advertisement
Advertisement