చెస్‌ చాంప్స్‌ ఓజస్, త్రిష | Sakshi
Sakshi News home page

చెస్‌ చాంప్స్‌ ఓజస్, త్రిష

Published Mon, Jul 10 2017 10:50 AM

చెస్‌ చాంప్స్‌ ఓజస్, త్రిష

సాక్షి, హైదరాబాద్‌: బ్రిలియంట్‌ ట్రోఫీ చెస్‌ టోర్నమెంట్‌లో ఎం. ఓజస్, కె. త్రిష విజేతలుగా నిలిచారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్‌ గ్రామర్‌ స్కూల్‌లో జరిగిన ఈ టోర్నీ జూనియర్స్‌ విభాగంలో చిన్మయ విద్యాలయాకు చెందిన ఓజస్, ఓపెన్‌ కేటగిరీలో ఎనీ టైమ్‌ చెస్‌అకాడమీకి చెందిన త్రిష టైటిళ్లను కైవసం చేసుకున్నారు. జూనియర్‌ విభాగంలో ఆరు రౌండ్లు ముగిసేసరికి ఓజస్‌ 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, ఏ. రఘురామన్, సాయి భార్గవ్‌ చెరో 5 పాయింట్లతో రెండో స్థానం కోసం పోటీపడ్డారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా రఘురామన్‌ రెండోస్థానాన్ని, సాయి భార్గవ్‌ మూడో స్థానాన్ని సాధించారు.

 

ఓపెన్‌ కేటగిరీలో త్రిష, పి. షణ్ముఖ తేజ చెరో 5.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్‌ స్కోరుతో త్రిష విజేతగా నిలిచింది. షణ్ముఖ తేజ రెండో స్థానంతో సరిపెట్టుకోగా, దిగ్విజయ్‌ సునీల్‌ (5) మూడో స్థానాన్ని సాధించాడు. ఆదివారం జరిగిన జూనియర్స్‌ చివరి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఓజస్‌ (6) సాయి భార్గవ్‌ (5)పై, అశ్మితా రెడ్డి (5) నిఖిలేశ్‌ (4)పై, నిగమశ్రీ (5) సంతోష్‌ కుమార్‌ (4)పై, రఘురామన్‌ (5) శ్రీనందమ్‌ (4)పై, స్నేహ (5) హిమేశ్‌ (4)పై నెగ్గారు. సీనియర్స్‌ విభాగంలో త్రిష (5.5) తరుణ్‌ (4.5)పై, షణ్ముఖ తేజ (5.5) దీప్తాంశ్‌ (4.5)పై, విశ్వనాథ్‌ (5) రాజు (4)పై, సత్యనారాయణ (5), రామ్‌ (4)పై, దిగ్విజయ్‌ (5) ఫణి కనూరి (4)పై విజయం సాధించారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో హైదరాబాద్‌ జిల్లా చెస్‌ సంఘం కార్యదర్శి కె. కన్నారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.

ఇతర వయో విభాగాల విజేతల వివరాలు

అండర్‌–14 బాలురు: 1. బి. సాకేత్, 2. మెహుల్‌ పండూగ్‌; బాలికలు: 1. ఎన్‌.స్నేహ. అండర్‌–12 బాలురు: 1. శ్రీహిత్‌ రెడ్డి, 2. మహిజిత్‌; బాలికలు: అశ్మితా రెడ్డి, 2.శ్రీ హర్షిత. అండర్‌–10 బాలురు: 1. ఆర్యన్‌ రఘురామ్, 2. సాయి భార్గవ్‌; బాలికలు: 1. నిగమశ్రీ, 2. భవిష్య. అండర్‌–8 బాలురు: 1. పార్థ్‌ గుప్తా, 2. సంతోష్‌ కుమార్‌; బాలికలు: 1. శ్రాగ్వి, 2. జస్మిత. అండర్‌–6 బాలురు: 1. కె. సూర్య, 2. పవన్‌ కుమార్‌; బాలికలు: 1. సస్య.
 

Advertisement
Advertisement