రెండో రౌండ్‌లో సిక్కి-ప్రణవ్ జోడీ | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌లో సిక్కి-ప్రణవ్ జోడీ

Published Thu, Mar 24 2016 1:11 AM

Open Grand Prix Gold badminton tournament, Sikki-Pranav pair of in the second round

ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ క్రీడాకారులు సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డి డబుల్స్ విభాగంలో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా ద్వయం 21-8, 21-9తో జొనాథన్ సన్-జెన్నిఫర్ టామ్ (న్యూజిలాండ్) జంటను ఓడించింది.

పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి జోడీ 21-11, 17-21, 21-16తో షాంగ్ కాయ్ లిన్-లూ చింగ్ యావో (చైనీస్ తైపీ) ద్వయంపై గెలిచింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement