ఆటలో విషాదం: పాకిస్తాన్‌ క్రికెటర్‌ మృతి | Sakshi
Sakshi News home page

ఆటలో విషాదం: పాక్‌ క్రికెటర్‌ మృతి

Published Wed, Aug 16 2017 3:21 PM

ఆటలో విషాదం: పాకిస్తాన్‌ క్రికెటర్‌ మృతి - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: క్రికెట్‌ ఆడే సమయంలో బ్యాట్‌మెట్‌ జాగ్రత్తగా ఉండాలి. బౌలర్‌ వేసే బంతిని సరిగ్గా అంచానా వేయగలగాలి. ఏమాత్రం ఏమరపాటు వహించినా బంతి తగలరాని చోట తగిలి మృత్యువును కౌగిలికి వెళ్లాల్సిందే. అలాంటి సంఘటన పాకిస్తాన్‌లో జరిగింది. బౌన్సర్‌ దెబ్బకు మరో యువ క్రికెటర్‌ మృత్యువాత పడ్డాడు. పాకిస్తాన్‌కు చెందిన యువ బ్యాట్‌మెన్‌ జుబైర్‌ అహ్మద్‌ ఓ బౌన్సర్‌ బంతికి ప్రాణం విడిచాడు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మార్డన్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో జుబైర్‌.. క్వెట్టా బియర్స్‌ జట్టు తరపున ఆడుతున్నాడు.

మ్యాచ్‌ సమయంలో ప్రత్యర్థి బౌలర్‌ విసిరిన బౌన్సర్‌ బంతి జుబైర్‌ తలను బలంగా తగలడంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషాయన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ట్వట్టర్‌ ద్వారా తెలిపింది. జుబైర్‌ మరణం ఆటగాళ్లకు భద్రత ముఖ్యమనే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తోందని వ్యాఖ్యానించింది. ఎల్లవేళలా హెల్మెట్‌ ధరించాలని సూచిస్తూ, మృతుడి కుటుంబానికి సంతాపాన్ని తెలిపింది.

దేశవాళీ టోర్నీలో ఆడుతూ ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్, ప్రత్యర్థి జట్టు బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌ను ఆడబోయి మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement