షహ్‌జైబ్‌ హసన్‌పై సస్పెన్షన్‌ వేటు | Sakshi
Sakshi News home page

షహ్‌జైబ్‌ హసన్‌పై సస్పెన్షన్‌ వేటు

Published Sat, Mar 18 2017 1:39 AM

Pakistan's Shahzaib Hasan suspended for suspected spot-fixing

కరాచీ: పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మరో క్రికెటర్‌ను సస్పెండ్‌ చేసింది. పీఎస్‌ఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలెదుర్కొంటున్న బ్యాట్స్‌మన్‌ షహ్‌జైబ్‌ హసన్‌పై తాత్కాలిక సస్పెన్షన్‌ వేటు వేసింది.

దీంతో ఈ ఉదంతంలో సస్పెండైన వారి జాబితా నలుగురికి చేరింది. షహ్‌జైబ్‌ 2009 టి20  ప్రపంచకప్‌లో ఆడాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో ఫిక్సింగ్‌ పాల్పడినట్లు ప్రాథమికంగా తేలడంతో పీసీబీ ఇదివరకే ముగ్గురిని సస్పెండ్‌ చేసింది.

Advertisement
Advertisement