గెలుపు ముంగిట ఐర్లాండ్ | Sakshi
Sakshi News home page

గెలుపు ముంగిట ఐర్లాండ్

Published Mon, Feb 16 2015 10:03 AM

గెలుపు ముంగిట ఐర్లాండ్

నెల్సన్: ప్రపంచకప్ లో భాగంగా వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఐర్లాండ్ గెలుపు ముంగిట నిలిచింది. 43.5 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 290 పరుగులు చేసింది. విజయానికి 38 బంతుల్లో 15 పరుగులు చేయాలి.

స్టిర్లింగ్, జొయస్, ఓబ్రిన్ అర్థ సెంచరీలతో రాణించారు. స్టిర్లింగ్ 8 పరుగుల తేడాతో సెంచరీ  మిస్ అయ్యాడు. 84 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. జొయస్(84), ఓబ్రిన్(64) అర్థ సెంచరీలు నమోదు చేశారు.

Advertisement
Advertisement