'మా బ్యాటింగ్ బాలేదు' | Sakshi
Sakshi News home page

'మా బ్యాటింగ్ బాలేదు'

Published Wed, Oct 14 2015 10:22 PM

'మా బ్యాటింగ్ బాలేదు'

ఇండోర్: టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో తమ బ్యాటింగ్ ఎంతమాత్రం బాలేదని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తెలిపాడు. టీమిండియా విజయం సాధించిన అనంతరం అవార్డుల కార్యక్రమంలో డివిలియర్స్ మాట్లాడుతూ.. స్వల్ప లక్ష్యాన్ని చేరే క్రమంలో తమ ఆటగాళ్లు తడబడ్డారన్నాడు. బౌలర్లు ఆకట్టుకున్నా.. బ్యాటింగ్ లో వైఫల్యంతో ఓటమి చెందామని ఒప్పుకున్నాడు. మ్యాచ్ కు శుభారంభం లభించినా.. వరుసగా వికెట్లను చేజార్చుకుని ఓటమి చెందామన్నాడు. ప్రధానంగా టాప్ ఆర్డర్ లో ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే రాణించడంతో పరాజయం పాలయ్యామన్నాడు.

ఇక్కడ వికెట్ లెంగ్త్ అక్షర్ పటేల్ కు సరిగ్గా ఉంటుందని భావించే అతన్ని రెండో వన్డేలో కూడా కొనసాగించినట్లు  టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశాడు. ముఖ్యంగా అక్షర్ తో పాటు హర్భజన్ సింగ్ కూడా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారని ధోని అన్నాడు.

Advertisement
Advertisement