ఫుట్సాల్కు రంగం సిద్ధం | Sakshi
Sakshi News home page

ఫుట్సాల్కు రంగం సిద్ధం

Published Thu, Jul 14 2016 4:47 PM

ఫుట్సాల్కు రంగం సిద్ధం - Sakshi

చెన్నై: భారత్లో జరుగనున్న కొత్త ఫుట్ బాల్ లీగ్ ప్రీమియర్ ఫుట్సాల్ లీగ్కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నో లీగ్లకు వేదికైన భారత్లో మరో లీగ్ అభిమానుల్ని అలరించనుంది. మరికొద్ది గంటల్లో  ప్రారంభమయ్యే ఈ లీగ్ లో పాల్గొనేందుకు పలువురు ఆటగాళ్లు భారత్ కు చేరుకుంటున్నారు. ఈ మేరకు బ్రెజిల్ సాకర్ ఆటగాడు రొనాల్డిన్హో భారత్ లో అడుగుపెట్టాడు.

'ఈ 5-ఎ సైడ్' అనే పేరుతో పిలవబడే ఈ లీగ్ జూలై 15వ తేదీ నుంచి 24 వ తేదీ వరకూ కొనసాగనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం దాదాపు 21 దేశాలకు చెందిన 50 మంది ఆటగాళ్లు పాల్గొనున్నారు. పది రోజుల పాటు జరిగే ఈ టోర్నీలోని మ్యాచ్లకు చెన్నై, గోవా నగరాలు ప్రధాన వేదిక కానున్నాయి. ఈ టోర్నీలో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు రెండు గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి.  సాధారణంగా ఫుట్ బాల్ తుది జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉంటే, ఈ లీగ్ లో 12 మంది పాల్గొంటారు. ఇండోర్ స్టేడియాల్లో జరిగే  ఒక్కో మ్యాచ్ కాల వ్యవధి 40 నిమిషాలు. ప్రీమియర్ ఫుట్‌సాల్‌కు పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాలర్ లూయిస్ ఫిగో నేతృత్వం వహిస్తుండగా, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బ్రాండ్ అంబాసిండర్ గా వ్యవహరిస్తున్నాడు.

షెడ్యూల్

జూలై 15, 2016- చెన్నై వర్సెస్ ముంబై(గ్రూప్-ఎ), వేదిక-చెన్నై
జూలై 15, 2016- గోవా వర్సెస్ కోల్ కతా(గ్రూప్-బి), వేదిక-చెన్నై
జూలై16, 2016-ముంబై వర్సెస్ కొచ్చి(గ్రూప్-ఎ), వేదిక-చెన్నై
జూలై16, 2016-బెంగళూరు వర్సెస్ గోవా(గ్రూప్-బి), వేదిక-చెన్నై
జూల్ 17, 2016-కొచ్చి వర్సెస్ చెన్నై(గ్రూప్-ఎ), వేదిక-చెన్నై
జూల్ 17, 2016-బెంగళూరు వర్సెస్ గోవా(గ్రూప్-బి), వేదిక- చెన్నై

జూలై 18 విశ్రాంతి దినం

జూలై19, 2016-కోల్ కతా వర్సెస్ గోవా(గ్రూప్-బి), వేదిక-గోవా
జూలై19, 2016-ముంబై వర్సెస్ చెన్నై(గ్రూప్-ఎ), వేదిక-గోవా
జూలై 20, 2016-బెంగళూరు వర్సెస్ కోల్ కతా(గ్రూప్-బి), వేదిక-గోవా
జూలై 20, 2016-కొచ్చి వర్సెస్ ముంబై(గ్రూప్-ఎ),వేదిక-గోవా
జూలై 21, 2016- గోవా వర్సెస్ బెంగళూరు(గ్రూప్-బి), వేదిక-గోవా
జూలై 21, 2016- చెన్నై వర్సెస్ కొచ్చి(గ్రూప్-బి), వేదిక-గోవా

జూలై 22 విశ్రాంతి దినం

జూలై 23 , 2016-గ్రూప్ ఎ విన్నర్ వర్సెస్ గ్రూప్ బి రన్నరప్,వేదిక-గోవా
జూలై 23 , 2016-గ్రూప్ బి విన్నర్ వర్సెస్ గ్రూప్ ఎ రన్నరప్, వేదిక-గోవా
జూలై 24, 2016-ఫైనల్, టోర్నీ ముగింపు కార్యక్రమం

Advertisement
Advertisement