పంజాబ్ పరాక్రమం | Sakshi
Sakshi News home page

పంజాబ్ పరాక్రమం

Published Mon, Sep 29 2014 12:56 AM

పంజాబ్ పరాక్రమం

వరుసగా నాలుగో గెలుపు
 
 మొహాలీ: అనురీత్ సింగ్ (3/12), అక్షర్ పటేల్ (3/15) బంతితో రాణించడంతో... చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వరుసగా నాలుగో విజయం సాధించింది. ఆదివారం జరిగిన గ్రూప్-బి ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో కేప్ కోబ్రాస్‌పై విజయం సాధిం చింది. మొత్తం 16 పాయింట్లతో గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్... హైదరాబాద్‌లో గురువారం జరిగే సెమీస్‌లో చెన్నై లేదా లాహోర్‌లలో ఒకదానితో ఆడుతుంది. మరో సెమీస్‌లో కోల్‌కతా, హోబర్ట్ తలపడతాయి.  
  పీసీఏ మైదానంలో జరిగిన గ్రూప్ బి మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కోబ్రాస్ 18.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు రిచర్స్ లెవీ (37 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆమ్లా (22 బంతుల్లో 40; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా... పంజాబ్ బౌలర్ల క్రమశిక్షణతో కోబ్రాస్ వరుసగా వికెట్లు కోల్పోయింది.  కోబ్రాస్ 75 పరుగుల తేడాతో 9 వికెట్లు చేజార్చుకుంది. అనురీత్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ చెరో మూడు వికెట్లు తీశారు.
 అనంతరం పంజాబ్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 139 పరుగులు చేసి గెలిచింది. సాహా (35 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. వోహ్రా (15 బంతుల్లో 23; 4 ఫోర్లు), మ్యాక్స్‌వెల్ (19 బంతుల్లో 23; 2 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. సెహ్వాగ్ (26 బంతుల్లో 23; 3 ఫోర్లు) రాణించాడు.
 స్కోరు వివరాలు
 కేప్ కోబ్రాస్ ఇన్నింగ్స్: రిచర్డ్స్ లెవీ (సి) అండ్ (బి) మ్యాక్స్‌వెల్ 42; ఆమ్లా (సి) మిల్లర్ (బి) కరణ్‌వీర్ 40; రమేలా (సి) మిల్లర్ (బి) పెరీరా 12; వాన్ జైల్ (బి) అనురీత్ సింగ్ 13; విలాస్ (సి) పెరీరా (బి) అవానా 10; ఎంగెల్‌బ్రెక్ట్ (బి) అక్షర్ 5; కెంప్ (స్టంప్డ్) సాహా (బి) అక్షర్ 2; ఫిలాండర్ (సి) సాహా (బి) అక్షర్ 5; పీటర్సన్ (సి) సాహా (బి) అనురీత్ సింగ్ 2; క్లెన్‌వెల్ట్ (సి) వోహ్రా (బి) అనురీత్ సింగ్ 0; గిజిమా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (18.3 ఓవర్లలో ఆలౌట్) 135.
 వికెట్ల పతనం: 1-60; 2-84; 3-105; 4-117; 5-122; 6-124; 7-131; 8-132; 9-135; 10-135
 బౌలింగ్: అనురీత్ సింగ్ 2.3-0-12-3; అవానా 4-0-36-1; అక్షర్ పటేల్ 4-0-15-3; తిసారా పెరీరా 2-0-30-1; కరణ్‌వీర్ సింగ్ 4-0-23-1; మ్యాక్స్‌వెల్ 2-0-17-1.
 కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) క్లెన్‌వెల్ట్ (బి) పీటర్సన్ 23; వోహ్రా (సి) ఎంగెల్‌బ్రెక్ట్ (బి) పీటర్సన్ 23; సాహా నాటౌట్ 42; మ్యాక్స్‌వెల్ (బి) ఎంగెల్‌బ్రెక్ట్ 23; మిల్లర్ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: (18.1 ఓవర్లలో 3 వికెట్లకు) 139.
 వికెట్ల పతనం: 1-41; 2-74; 3-108
 బౌలింగ్: క్లెన్‌వెల్ట్ 4-0-24-0; ఫిలాండర్ 4-0-27-0; పీటర్సన్ 4-1-19-2; ఎంగెల్‌బ్రెక్ట్ 4-0-42-1; గిజిమా 1-0-8-0; రమేలా 1-0-10-0; ఆమ్లా 0.1-0-4-0.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement