బెంగళూరు టార్గెట్ 131 | Sakshi
Sakshi News home page

బెంగళూరు టార్గెట్ 131

Published Fri, Apr 24 2015 9:42 PM

బెంగళూరు టార్గెట్ 131

అహ్మదాబాద్: బౌలర్లు సమిష్టిగా రాణించి వరుసగా వికెట్లు తీయడంతో రాజస్థాన్ రాయల్స్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తక్కువ స్కోరుకు కట్టడి చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.

స్టీవెన్ స్మిత్( 31; 28 బంతుల్లో 2 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. షేన్ వాట్సన్ 26, స్టువర్ట్ బిన్నీ 20, రహానే 18, కరుణ్ నాయర్ 16, సంజూ శామ్సన్ 4, ఫాల్కనర్ 4 పరుగులు చేసి అవుటయ్యారు. దీపక్ హుడా, కులకర్ణి ఒక్కో పరుగుకే పరిమితమయ్యారు.

బెంగళూరు బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, యుజువేంద్ర చహాల్ 2, హర్షాల్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. ఇక్బాల్ అబ్దుల్లా ఒక వికెట్ దక్కించుకున్నాడు.

Advertisement
Advertisement