విజయం దిశగా అఫ్గానిస్తాన్
డెహ్రాడూన్: రషీద్ ఖాన్ (5/82) స్పిన్‌తో అఫ్గానిస్తాన్ టెస్టుల్లో తొలి విజయానికి పరుగు పెడుతోంది. ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో రషీద్ ఖాన్ మొత్తం ఏడు వికెట్లు తీశాడు. ఓవర్‌నైట్ స్కోరు 22/1తో మూడో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఐర్లాండ్ 288 పరుగుల వద్ద ఆలౌటైంది. బాల్బిర్నీ (82; 11 ఫోర్లు), ఓబ్రియాన్ (56; 7 ఫోర్లు) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గాన్‌కు లభించిన ఆధిక్యంతో లక్ష్యం 147 పరుగులే కాగా... దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో ఆట నిలిచే సమయానికి వికెట్ కోల్పోయి 29 పరుగులు చేసింది. ఎహ్సానుల్లా (16 బ్యాటింగ్), రహమత్‌షా (11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.