ఐసీసీ పదవికి రవిశాస్త్రి రాజీనామా | Sakshi
Sakshi News home page

ఐసీసీ పదవికి రవిశాస్త్రి రాజీనామా

Published Sat, Jul 2 2016 1:35 AM

ఐసీసీ పదవికి రవిశాస్త్రి రాజీనామా

న్యూఢిల్లీ: ఐసీసీకి చెందిన క్రికెట్ కమిటీలో మీడియా ప్రతినిధిగా కొనసాగుతున్న మాజీ కెప్టెన్ రవిశాస్త్రి ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు నూతన కోచ్‌గా నియమితులైన అనిల్ కుంబ్లే ఈ కమిటీకి చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ‘ఆ కమిటీలో ఆరేళ్లుగా ఉన్న నేను ఇప్పటికే రాజీనామాను పంపాను.

వ్యక్తిగత వ్యవహారాలతోనే పదవి నుంచి తప్పుకుంటున్నాను’ అని శాస్త్రి క్లుప్తంగా తెలిపారు. కోచ్ పదవి కోసం రవిశాస్త్రి, కుంబ్లేల మధ్య గట్టిపోటీ నడిచిన విషయం తెలిసిందే. అయితే క్రికెట్ కమిటీ చైర్మన్‌గా కొనసాగేందుకు కుంబ్లే సుముఖత వ్యక్తం చేయడంతో ఆయనతో కలిసి పనిచేసేందుకు రవిశాస్త్రి ఇష్టపడకపోవచ్చని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
 

Advertisement
Advertisement