రోజర్ ఫెడరర్ కు షాక్ | Sakshi
Sakshi News home page

రోజర్ ఫెడరర్ కు షాక్

Published Thu, Mar 2 2017 12:31 PM

Roger Federer Stunned by World No. 116 Evgeny Donskoy in Dubai

దుబాయ్:ఇటీవల ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలిచి తన కెరీర్లో 18వ గ్రాండ్ స్లామ్ సాధించిన మాజీ వరల్డ్ నంబర్ వన్ రోజర్ ఫెడరర్ కు దుబాయ్ చాంపియన్ షిప్ లో షాక్ తగిలింది. బుధవారం జరిగిన ప్రి-క్వార్టర్ ఫైనల్లో 116 ర్యాంకు ఆటగాడు డాన్ స్కాయ్(రష్యా) 3-6, 7-6 (9/7), 7-6 (7/5) తేడాతో ఫెడరర్ ను ఓడించి క్వార్టర్స్ కు చేరాడు. తొలి సెట్ ను గెలిచిన ఫెడరర్.. ఆ తరువాత వెనుకబడి ఓటమి పాలయ్యాడు. టై బ్రేక్ కు దారి తీసిన రెండు, మూడు సెట్లలో ఫెడరర్ ను డాన్ స్కాయ్ ఓడించి తదుపరి పోరుకు అర్హత సాధించాడు.  దాంతో ఫెడరర్ పోరాటం ప్రి క్వార్టర్స్ లోనే ముగిసింది.  2007 నుంచి చూస్తే  ఒక క్వాలిఫయర్ చేతిలోఫెడరర్ ఓటమి పాలుకావడం ఇప్పటికి మూడుసార్లు జరిగింది.

 

Advertisement
Advertisement