రోహిత్‌కు విశ్రాంతి!

21 Nov, 2019 04:26 IST|Sakshi

ధావన్‌పై వేటు తప్పదేమో

విండీస్‌తో వన్డే, టి20లకు భారత జట్టు ఎంపిక నేడే  

కోల్‌కతా: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు భారత స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు విశ్రాంతినిచ్చే అవకాశాలున్నాయి. కోహ్లి లేని సందర్భంలో నాయకత్వ బాధ్యతల్ని మోసిన ఈ ‘హిట్‌మ్యాన్‌’పై విపరీతమైన పని ఒత్తిడిని జాతీయ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ గమనిస్తోంది. అదే విధంగా ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న శిఖర్‌ ధావన్‌కు ఉద్వాసన ఇచ్చినా ఆశ్చర్యం లేదు. గురువారం ముంబైలో సమావేశమయ్యే ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని కమిటీ విండీస్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు టీమిండియాను ఎంపిక చేయనుంది. ప్రధానంగా రోహిత్‌కు విశ్రాంతినిచ్చి ధావన్‌ను తప్పించే అంశాల్నే కమిటీ పరిశీలించనుంది.

బహుశా చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ఎంపిక చేసే ఆఖరి జట్టు ఇదే అవుతుందేమో. ఆయన నాలుగేళ్ల పదవీ కాలం ముగియనుంది. విండీస్‌తో సొంతగడ్డపై భారత్‌ ముందుగా మూడు టి20లు, మూడు వన్డేలు ఆడనుంది. కెపె్టన్‌ కోహ్లి కంటే ఈ ఏడాది రోహిత్‌ ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌తో కలుపుకొని 60 మ్యాచ్‌లు ఆడి ఉండటంతో రెస్ట్‌ ఇచ్చి న్యూజిలాండ్‌ పర్యటనకు అతన్ని తాజాగా సిద్ధం చేయాలని ఎమ్మెస్కే కమిటీ భావిస్తోంది. ప్రపంచకప్‌ గాయం తర్వాత జట్టులోకి వచి్చన ధావన్‌ పెద్దగా రాణించలేదు. దేశవాళీ క్రికెట్‌లోనూ అతని ప్రదర్శన పేలవంగా ఉంది. మరోవైపు మయాంక్‌ అగర్వాల్‌ టెస్టుల్లో తనకు అందివచి్చన అవకాశాల్ని సది్వనియోగం చేసుకున్నాడు.

దీంతో లోకేశ్‌ రాహుల్‌కు జతగా మయాంక్‌కు అవకాశం ఇవ్వొచ్చు. అలాగే నిలకడగా రాణిస్తున్న సంజూ సామ్సన్‌కు వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ స్థానంలో చోటు దక్కవచ్చు. కొత్త పేస్‌ ఎక్స్‌ప్రెస్‌ దీపక్‌ చాహర్‌ స్థానానికి ఏ ఢోకా ఉండదు. పైగా వివిధ రకాల గాయాలతో  హార్దిక్‌ పాండ్యా, బుమ్రా, నవ్‌దీప్‌ సైనీ, భువనేశ్వర్‌లు ప్రస్తుతం కోలుకుంటుండటంతో శివమ్‌ దూబే, శార్దుల్‌ ఠాకూర్‌లను కొనసాగించే అవకాశముంది. అలాగే వాషింగ్టన్‌ సుందర్, కృనాల్‌ పాండ్యాల ఎంపికను సెలక్టర్లు పరిశీలించే అవకాశముంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోహ్లికి ‘పెటా’ అవార్డు

మధ్యాహ్నం ఒంటి గంట నుంచి...

గంగూలీ సందులో గులాబీ గోల

పింక్‌బాల్‌.. అడిలైడ్‌ టూ కోల్‌కతా

సాక్షి ధోని బర్త్‌డే.. విష్‌ చేసిన హార్దిక్‌

పింక్‌ బాల్‌ క్రికెట్‌: మనోళ్ల సత్తా ఎంత?

రెడ్‌–పింక్‌ బాల్స్‌ మధ్య తేడా ఏమిటి!?

ఈ దశాబ్దం టీమిండియాదే!

‘అతడ్ని వదిలేశాం.. నిన్ను తీసుకుంటాం’

చాంపియన్స్‌ విశ్రుత్, స్నేహా

సహస్రారెడ్డి సెంచరీ వృథా

ఒడిశా వారియర్స్‌కు నిఖత్‌ జరీన్‌

ఆశలు గల్లంతు!

నూర్‌ సుల్తాన్‌లో భారత్, పాక్‌ డేవిస్‌ కప్‌ పోరు

పింక్‌ హుషార్‌

అతనిపై 4 మ్యాచ్‌లు... మీపై 12 నెలలా?

కామెరాన్‌.. సూపర్‌మ్యాన్‌లా పట్టేశాడు..!

రహానే బెడ్‌పైనే పింక్‌ బాల్‌..!

‘అదే మయాంక్‌కు అసలు పరీక్ష’

ఇదేం బౌలింగ్‌రా నాయనా.. ఆడమ్స్‌ను మించిపోయావే!

ఎలాగైనా బౌలింగ్‌ చేస్తా.. వికెట్‌ తీస్తా!

అది కేకేఆర్‌ బ్యాడ్‌ కాల్‌: యువరాజ్‌

డీన్‌ జోన్స్‌కు పార్థీవ్‌ అదిరిపోయే పంచ్‌

మరో బౌట్‌కు విజేందర్‌ రె‘ఢీ’

పాక్‌తో పోరుకు బోపన్న దూరం

నిలవాలంటే...గెలవాలి

శ్రీకాంత్‌పైనే ఆశలు

వెల్‌డన్‌  వెర్‌స్టాపెన్‌

50 చేసినా... మనమే గెలిచాం

గ్రీకు వీరుడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రివెంజ్‌ డ్రామా

నా దర్శక–నిర్మాతలకు అంకితం

హీరోయిన్‌ దొరికింది

జార్జిరెడ్డి పాత్రే హీరో

రూట్‌ మార్చారా?

వైఎస్‌గారికి మరణం లేదు