విజయ్‌ హజారే బరిలో రోహిత్‌ శర్మ | Sakshi
Sakshi News home page

విజయ్‌ హజారే బరిలో రోహిత్‌ శర్మ

Published Fri, Mar 3 2017 12:14 AM

విజయ్‌ హజారే బరిలో రోహిత్‌ శర్మ

గాయం కారణంగా నాలుగు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న భారత బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ తిరిగి మైదానంలోకి అడుగు పెడుతున్నాడు. ఫిట్‌నెస్‌ను అందుకున్న అతను దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా ఆంధ్ర, గోవాలతో జరిగే మ్యాచ్‌లలో ముంబై తరఫున ఆడనున్నాడు.

శస్త్రచికిత్స అనంతరం తాను పూర్తి స్థాయిలో కోలుకోవడంపై సందేహించానని, అయితే జాతీయ క్రికెట్‌ అకాడమీలో రీహాబిలిటేషన్‌ తర్వాత తనలో ఆత్మవిశ్వాసం పెరిగినట్లు రోహిత్‌ చెప్పాడు.

 

Advertisement
Advertisement