నిలబడ్డాడు నిలబెట్టాడు

3 Oct, 2016 11:24 IST|Sakshi
నిలబడ్డాడు నిలబెట్టాడు

రోహిత్ శర్మ అమోఘమైన నైపుణ్యం ఉన్న క్రికెటర్... కానీ ఎర్ర బంతి చూస్తే భయపడతాడు... అంతర్జాతీయ క్రికెట్ ఆడటం మొదలుపెట్టి తొమ్మిది సంవత్సరాలైనా అతడిపై ఈ ముద్ర మాత్రం ఇంకా చెరిగిపోలేదు. టి20ల్లో, వన్డేల్లో 2007లో అరంగేట్రం చేసిన రోహిత్.... 2013లోగానీ తొలి టెస్టు ఆడలేదు. నిజానికి దీనికి కారణాలు వేరు. సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్‌ల శకంలో టెస్టు జట్టులోకి రావడానికి రోహిత్‌కు అవకాశం రాలేదు.

నిజానికి ఆ సమయంలో రోహిత్ మాత్రమే కాదు... టెస్టుల్లో ఆడే అవకాశం కోసం చాలామంది యువ క్రికెటర్లు ఎదురు చూశారు. 2013లో సచిన్ ఆఖరి సిరీస్ ద్వారా టెస్టుల్లో రోహిత్ ఈడెన్‌గార్డెన్‌‌సలోనే అరంగేట్రం చేశాడు. ఈ రెండున్నరేళ్ల కాలంలో రోహిత్ ఆడింది 19 టెస్టులు. దాదాపు 35 సగటుతో రెండు సెంచరీలతో 1049 పరుగులు చేశాడు. నిజానికి ఇది అంత చెత్త ప్రదర్శనేం కాదు. కానీ రోహిత్ నుంచి ఇంకా ఎక్కువ ఆశించడం వల్ల విఫలమైన ప్రతిసారీ అతనిపై విమర్శలు వచ్చాయి. వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు... టి20లో సెంచరీ... ఇలా పొట్టి ఫార్మాట్‌లో రికార్డులు రోహిత్‌కు దాసోహం.

 ఇలా తను భారీగా పరుగులు చేయడంతో టెస్టుల్లో తన ప్రదర్శన చిన్నగా కనిపిస్తోంది. ఈ రెండున్నరేళ్ల కాలంలో రోహిత్ విఫలమైన ప్రతిసారీ ‘టెస్టుకు పనికిరాడు’ అనే విమర్శ పదే పదే వినిపించింది. మీడియాలో, అభిమానుల్లో ఇలాంటి విమర్శలు తరచూ వినిపిస్తున్నా కెప్టెన్లుగా ధోని, కోహ్లి మాత్రం రోహిత్‌పై నమ్మకం ఉంచారు. ఓ అద్భుతమైన ఆటగాడు ఏ ఫార్మాట్‌లో అయినా గంటలో ఆటను మార్చేస్తాడనేది ఎవరూ కాదనలేని వాస్తవం. భారత క్రికెట్‌లో రోహిత్ కూడా మ్యాచ్ విన్నర్. అందుకే ఎన్నిసార్లు ఎన్ని విమర్శలు వచ్చినా... తన కంటే ముందు కెప్టెన్‌లే సరైన సమాధానం ఇచ్చారు.

ఒడిదుడుకులు ఉన్నా..: కెరీర్‌లో ఆరంగేట్రంలో వరుసగా రెండు టెస్టుల్లో రెండు సెంచరీలు చేసిన రోహిత్... ఆ తర్వాత మాత్రం ఆ స్థాయి నిలకడ చూపించలేదనేది కూడా కాదనలేని వాస్తవం. ఐదుగురు బౌలర్ల సిద్ధాంతం ఎప్పుడు తెరమీదకు వచ్చినా రోహిత్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. నిజానికి తన స్థాయి క్రికెటర్‌కు ఇది జీర్ణించుకోవడం కష్టం. అడపాదడపా ఒక్కో అవకాశం లభించినా దానిని పూర్తిగా రెండు చేతులతో అందుకోలేకపోయాడు. అరుుతే ‘క్లాస్’ ఆటగాడు సరైన సమయంలో తన పూర్తి ఆటను బయటకు తీస్తాడు.
 
 తనకు బాగా కలిసొచ్చిన, ఇష్టమైన మైదానం ఈడెన్‌గార్డెన్‌‌సలో రోహిత్ ఆదివారం ఓ ‘క్లాసిక్’ ఇన్నింగ్‌‌స ఆడాడు. భారత్ రెండో ఇన్నింగ్‌‌సలో 43 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో రోహిత్ క్రీజులోకి వచ్చాడు. గత టెస్టు రెండో ఇన్నింగ్‌‌సలో అజేయంగా 68 పరుగులు చేసినా... కోల్‌కతా తొలి ఇన్నింగ్‌‌సలో తను విఫలమయ్యాడు. రెండో ఎండ్‌లో ఆడుతున్న కోహ్లి కూడా గొప్ప ఫామ్‌లో లేడు. ఈ సమయంలో ఈ ఇద్దరిలో ఎవరు అవుటైనా భారత్ ప్రమాదంలో పడేది. తొలి ఇన్నింగ్‌‌స ఆధిక్యం చేతిలో ఉన్నా... మ్యాచ్ కచ్చితంగా గెలవాలంటే 300పైచిలుకు ఆధిక్యం కచ్చితంగా కావాలి. బంతి ఎలా బౌన్‌‌స అవుతుందో అర్థంకాని స్థితిలో రోహిత్ అద్భుతంగా ఆడాడు.
 
 వన్డే స్పెషలిస్ట్ రోహిత్ టెస్టులు కూడా బాగా ఆడగలడని ఈ ఇన్నింగ్‌‌స చూపించింది. ఆరంభంలో బంతి కొత్తగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆడిన అతను, ఆ తర్వాత బంతి పాతబడిపోగానే తనదైన శైలిలో షాట్లు ఆడటం మంచి ఫలితాన్నిచ్చింది. కోహ్లి, సాహాలతో కలిసి రోహిత్ నిర్మించిన రెండు భాగస్వామ్యాలతో మ్యాచ్ పూర్తిగా భారత్ చేతిలోకి వచ్చింది. ఈ ఇన్నింగ్‌‌సలో రోహిత్ స్వీప్, లాఫ్ట్, డ్రైవ్ అన్ని రకాల షాట్లూ ఆడి తనలోని సహజ నైపుణ్యాన్ని మరోసారి బయటపెట్టాడు. చూడచక్కని కవర్‌డ్రైవ్‌లు అభిమానులకు ఆనందం పంచాయి.
 
 మరికొంత కావాలేమో!: ఈ ఇన్నింగ్‌‌స రోహిత్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ వాటిలో ఒకటిగా నిలుస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఎదురుదాడిని మేళవించి అద్భుతమైన ఇన్నింగ్‌‌సతో తను ఆకట్టుకున్నాడు. కెప్టెన్ తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు జట్టును నిలబెట్టాడు. ఈ సీజన్‌లో భారత్ స్వదేశంలో మరో 11 టెస్టులు ఆడాల్సి ఉంది. స్వదేశంలో సాధారణంగా స్పిన్ వికెట్లు ఉంటాయి కాబట్టి... ఐదుగురు బౌలర్ల సిద్ధాంతానికి వెళ్లకపోవచ్చు. కాబట్టి రోహిత్‌కు ఈ సీజన్‌లో కావలసినన్ని మ్యాచ్‌లు దొరికే అవకాశం ఉంది. ఇలాంటి ఇన్నింగ్‌‌స మరో రెండు ఆడి, మరికొంత నిలకడ చూపితే... తను ఐదుగురు బౌలర్లు ఉన్నా తుది జట్టులోకి వస్తాడు.                    
 -సాక్షి క్రీడావిభాగం


 

మరిన్ని వార్తలు