సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి | Sakshi
Sakshi News home page

సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి

Published Tue, Apr 12 2016 11:46 PM

సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో తమ తొలి మ్యాచ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమితో ప్రారంభించింది. ఐపీఎల్ 9లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఇక్కడ జరిగిన మ్యాచ్ లో 45 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరుగుల తేడాతో గెలుపొందింది. 228 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులే చేయగలిగింది. హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (58 పరుగులు; 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒక్కడు మాత్రమే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. అశిష్ రెడ్డి(32 పరుగులు; 18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పరవాలేదనిపించాడు. షేన్ వాట్సన్ ఈ ఇద్దర్ని వెనక్కిపంపి హైదరాబాద్ లను కష్టాల్లోకి నెట్టాడు. చివర్లో ఇయాన్ మోర్గాన్(22 నాటౌట్), కరణ్ శర్మ(26 నాటౌట్) ఓ మోస్తరుగా ఆడి ఓటమి అంతరాన్ని తగ్గించారు.


బెంగళూరు బాదుడు ఇన్నింగ్స్:
టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తొలుత బ్యాటింగ్ చేయాల్సిందిగా బెంగళూరును ఆహ్వానించాడు. ఓపెనర్ క్రిస్ గేల్(1) రెండో ఓవర్ లోనే పెవిలియన్ కు చేరిన తర్వాత హైదరాబాద్ కష్టాలు మొదలయ్యాయి. ఫస్ట్ డౌన్లో వచ్చిన డివిలియర్స్(82; 42 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) తన సహజసిద్ధమైన ఆటతో విరుచుకుపడ్డాడు. 26 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో హాఫ్ సెంచరీ మార్కు నమోదు చేసిన డివిలియర్స్ ఆపై మరింత రెచ్చిపోయాడు. అతనికి కెప్టెన్ విరాట్ కోహ్లీ (75; 51 బంతుల్లో 7 ఫోర్లు,3 సిక్సర్లు) రాణించడంతో బెంగూళురు 228 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చివర్లో సర్ఫరాజ్(35; 10 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించి హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం నిర్ధేశించాడు. సన్ రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, ముస్తాఫిజర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Advertisement
Advertisement