సచిన్ చివరి మ్యాచ్: విజృంభించిన ఓజా, వెస్టిండీస్ 182 ఆలౌట్ | Sakshi
Sakshi News home page

సచిన్ చివరి మ్యాచ్: విజృంభించిన ఓజా, వెస్టిండీస్ 182 ఆలౌట్

Published Thu, Nov 14 2013 2:09 PM

Sachin Tendulkar farewell match: Indian bowlers shine in Mumbai test

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ చివరి మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా స్పిన్నర్లు వెస్టిండీస్ బ్యాట్స్మెన్ను ఓ ఆటాడుకున్నారు. ముంబై వాంఖడే స్టేడియంలో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో భారత బౌలర్లు కరీబియన్లును 182 పరుగులకే కుప్పకూల్చారు.

  • విండీస్ తొలి ఇన్నింగ్స్ రెండో సెషన్లోపే ముగిసింది. హైదరాబాదీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఐదు వికెట్లు తీశాడు. అశ్విన్ మూడు, షమీ, భువనేశ్వర్ ఒక్కో వికెట్ తీశారు.
  • లంచ్ సమయానికి విండీస్ రెండు వికెట్లకు 93 పరుగులు చేసింది. ఆ తర్వాత విండీస్ వికెట్ల పతనం పేకమేడను తలపించింది. వెంటవెంటనే ఎనిమిది వికెట్లు కోల్పోయింది.
  • రెండో  సెషన్ ఆరంభంలో ఓజా వెంటవెంటనే పావెల్ (48), శామ్యూల్స్ (19)ను అవుట్ చేశాడు.
  • ఐపీఎల్లో సిక్సర్లు అలవోకగా బాదేస్తూ.. అందరినీ హడలెత్తించిన క్రిస్ గేల్ మొదట్లోనే 11 పరుగులకు చాప చుట్టేశాడు.
  • తొలి మ్యాచ్లో 9 వికెట్లు తీసి దడదడలాడించిన భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీ.. గేల్ ను బోల్తా కొట్టించాడు.
  • లంచ్కు కాస్త ముందుగా డారెన్ బ్రావోను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. బ్రావో ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
  • ఈ మ్యాచ్లో బారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న ఈ మ్యాచ్ చూసేందుకు సచిన్ టెండూల్కర్ కుటుంబం మొత్తం వాంఖడే స్టేడియానికి చేరుకుంది.
  • మ్యాచ్ను చూసేందుకు ఇప్పటికే క్రికెట్ దిగ్గజాలు, రాజకీయ నాయకులు, సినీతారలు, సచిన్ అభిమానులతో స్టేడియం కిక్కిరిసింది.
  • సచిన్కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. క్రికెట్ ప్రపంచ చరిత్రలో 200వ టెస్టు ఆడుతున్న తొలి ఆటగాడిగా మాస్టర్ చరిత్ర సృష్టించాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement