సచిన్ చివరి మ్యాచ్: మూడో రోజే ఇన్నింగ్స్ తేడాతో భారత్ విజయం | Sakshi
Sakshi News home page

సచిన్ చివరి మ్యాచ్: మూడో రోజే ఇన్నింగ్స్ తేడాతో భారత్ విజయం

Published Sat, Nov 16 2013 11:55 AM

సచిన్ చివరి మ్యాచ్: మూడో రోజే ఇన్నింగ్స్ తేడాతో భారత్ విజయం

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వీడ్కోలు టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. మంబై టెస్టులో మూడో రోజే విండీస్ను ఇన్నింగ్స్ 126 పరుగుల తేడాతో మట్టికరిపించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ను ధోనీసేన 2-0తో సొంతం చేసుకుంది. 43/3 ఓవర్నైట్ స్కోరుతో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 187 పరుగులకు కుప్పకూలింది. భారత స్పిన్నర్లు ప్రజ్ఞాన్ ఓజా, అశ్విన్ విండీస్ పతనాన్ని శాసించారు. రెండో ఇన్నింగ్స్లో ఓజా ఐదు, అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ ఆడే అవసరం రాకపోవడంతో మళ్లీ బ్యాటింగ్కు దిగని సచిన్ రెండు ఓవర్లు బౌలింగ్ చేసి అభిమానులను అలరించాడు. మాస్టర్కు వాంఖడే స్టేడియంలో ఘనమైన వీడ్కోలు లభించింది.

  • విండీస్ బ్యాట్స్మన్ గాబ్రియెల్ను షమీ బౌల్డ్ చేయడంతో భారత్ విజయం ఖాయమైంది. మూడో రోజు విండీస్ తొలిసెషన్ లోనే మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి మూట గట్టుకుంది.
  • ఈ మ్యాచ్లో ఓజా మొత్తం పది వికెట్లు తీశాడు. ఓఝా వరుసగా మూడు వికెట్లు తీశాడు.
  • శామ్యూల్స్ (11), విండీస్ మెరుపు వీరుడు క్రిస్గేల్ (35)ను ఓజా పెవిలియన్ బాటపట్టించాడు. శామ్యూల్స్ను స్టంపవుట్ చేసిన ధోనీ.. గేల్ క్యాచ్ అందుకున్నాడు.
  • డియోనరైన్ ఓజా బౌలింగ్ లో అతనికే క్యాచిచ్చి వెనుదిరిగాడు.
  • అనంతరం చందర్ పాల్, రాందిన్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఈ దశలో చందర్ పాల్ను అశ్విన్ అవుట్ చేయగా, ఆ వెంటనే సామీని ఓజా పెవిలియన్ చేర్చాడు.
  • సచిన్ బౌలింగ్ కు దిగడంతో స్టేడియంలో ఒక్కసారిగా ఊపు వచ్చింది.
  • విండీస్ చివరి రెండు వికెట్లను రెండు పరుగుల తేడాతో కోల్పోయింది.  
  • శుక్రవారం సాయంత్రం విండీస్ బ్యాట్స్మెన్ పావెల్ (9), బెస్ట్ (9), డారెన్ బ్రావో (11) తక్కువ పరుగులకే అవుటయ్యారు.
  • భారత్ తొలి ఇన్నింగ్స్లో 495 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 313 పరుగుల ఆధిక్యం సాధించింది.
  • తన చివరి మ్యాచ్లో బ్యాటింగ్ గ్రేట్ సచిన్ (74) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. డియోనరైన్ బౌలింగ్లో సామీకి క్యాచ్ ఇచ్చాడు.
  • రోహిత్ శర్మ (111 నాటౌట్), చటేశ్వర్ పుజారా (113) సెంచరీలతో చెలరేగారు. రోహిత్కిది వరుసగా రెండో శతకం కావడం విశేషం. షిల్లింగ్ఫోర్డ్ ఐదు వికెట్లు తీశాడు.
  • విండీస్ తొలి ఇన్నింగ్స్లో 182 పరుగులకు ఆలౌటైంది. ఓజా ఐదు, అశ్విన్ మూడు వికెట్లు తీశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement