కరాచీ:ఐదేళ్ల క్రితం స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన ముగ్గురు పాకిస్థాన్ క్రికెటర్లలో ఒకడైన సల్మాన్ భట్ తన పునరాగమనంపై ఆసక్తిగా ఉన్నాడు. సల్మాన్ భట్ ఐదేళ్ల శిక్షా కాలం సెప్టెంబర్ 1న ముగుస్తున్న నేపథ్యంలో.. అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ భవిష్యత్తుపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. తనను తిరిగి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడేందుకు అనుమంతిచాలని క్రికెట్ బోర్డును అభ్యర్థించినట్లు పీసీబీ సీనియర్ అధికారి స్పష్టం చేశాడు. దీనిలో భాగంగానే శుక్రవారం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక శాఖ అధికారులను, న్యాయనిపుణులను భట్ కలిశాడని.. కనీసం దేశంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లు ఆడేందుకైనా అనుమతి ఇవ్వాలని భట్ విన్నవించాడని సదరు అధికారి పేర్కొన్నాడు.
ఫిక్సింగ్ కు పాల్పడి నిషేధం ఎదుర్కొంటున్న ముగ్గురు పాకిస్తాన్ క్రికెటర్లు మొహమ్మద్ ఆమిర్, ఆసిఫ్, సల్మాన్ భట్‌లకు ఇటీవల ఉపశమనం లభించింది. వారి శిక్షా కాలం సెప్టెంబర్ 1న ముగుస్తుండడంతో పోటీ క్రికెట్లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం అధికారికంగా ధ్రువీకరించింది.
వీరిలో ఆమిర్‌కు అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఆడేందుకు అనుమతి లభించింది. ‘యాంటీ కరప్షన్ ట్రిబ్యునల్ విధించిన కొన్ని షరతులకు లోబడి వారు పోటీ క్రికెట్లో అడుగు పెట్టవచ్చు. ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్లో కూడా పాల్గొనవచ్చు’ అని ఐసీసీ పేర్కొంది. ఆసిఫ్, భట్‌లకు ఏడు, పదేళ్ల చొప్పున శిక్ష విధించినా.. అందుకు సడలింపునిస్తూ దానిని ఐదేళ్లకే పరిమితం చేశారు. కాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాజాగా తీసుకునే నిర్ణయంపైనే వారి భవితవ్యం ఆధారపడి వుంటుంది.
నేను క్రికెట్ ఆడేందుకు అనుమతించండి!
Published Sat, Aug 29 2015 7:03 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
బాంబీ బకెట్ అంటే ఏమిటి? కార్చిచ్చును ఎలా నియంత్రిస్తుంది?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- ఈసారి ఓటు మార్పు కోసమే
- మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే
- కృష్ణమ్మ తీరం విజయహారం
- వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
- గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
- పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
- శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
- Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
- వంట సరిగా చేయలేదని.. భార్యను చంపిన భర్త
Advertisement