బీడీఎల్‌ను గెలిపించిన సందీప్ | Sakshi
Sakshi News home page

బీడీఎల్‌ను గెలిపించిన సందీప్

Published Sat, Oct 18 2014 1:23 AM

బీడీఎల్‌ను గెలిపించిన సందీప్

 ‘ఎ' డివిజన్ 3డే జట్ల వన్డే లీగ్

 సాక్షి, హైదరాబాద్: బావనక సందీప్ (109) సెంచరీ సాధించడంతో కిషన్ పర్షాద్ ‘ఎ' డివిజన్ మూడు రోజుల వన్డే లీగ్ మ్యాచ్‌లో బీడీఎల్ 27 పరుగుల తేడాతో ఆర్.దయానంద్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బీడీఎల్ 9 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. రాహుల్ సింగ్ (40), కె.సుమంత్ (30) రాణించారు. ప్రదీప్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం దయానంద్ జట్టు 8 వికెట్లకు 275 పరుగులు మాత్రమే చేయగలిగింది. నితేశ్ రెడ్డి (82) అర్ధ సెంచరీ సాధించగా, చందన్ సహాని (40 నాటౌట్), నవీన్ కుమార్ (40), భగత్ వర్మ (33) ఆకట్టుకున్నారు.

  మరో మ్యాచ్‌లో ఎస్‌బీహెచ్ 4 వికెట్లతో ఎంపీ కోల్ట్స్‌ను ఓడించింది. ఆకర్ష్ కులకర్ణి (85) అర్ధ సెంచరీ సహాయంతో ఎంపీ కోల్ట్స్ 217 పరుగులు చేసింది. టి.సుమన్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఎస్‌బీహెచ్ 6 వికెట్లకు 221 పరుగులు సాధించింది. అహ్మద్ ఖాద్రీ (72) టాప్‌స్కోరర్‌గా నిలవగా, టి. సుమన్ (40), అనూప్ పాయ్ (30) రాణించారు.

 ఆంధ్రకు భారీ ఆధిక్యం: సౌత్‌జోన్ అండర్-16 టోర్నీ (విజయ్ మర్చంట్ ట్రోఫీ) మ్యాచ్‌లో హైదరాబాద్‌పై ఆంధ్ర 237 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందుకుంది. మైసూర్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 119.4 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. కె. మహీప్ కుమార్ (342 బంతుల్లో 183; 24 ఫోర్లు) భారీ సెంచరీతో చెలరేగగా, సందీప్ (66), వంశీకృష్ణ (44) రాణించారు. షేక్ సొహైల్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 58.2 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. సూర్య తేజ (46), వరుణ్ గౌడ్ (41) ఫర్వాలేదనిపించారు. షేక్ రఫీ (4/43) చక్కటి బౌలింగ్‌తో హైదరాబాద్‌ను దెబ్బ తీశాడు. వర్మకు 3 వికెట్లు దక్కాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement