బీసీసీఐపై సుప్రీం ఆగ్రహం | Sakshi
Sakshi News home page

బీసీసీఐపై సుప్రీం ఆగ్రహం

Published Thu, Mar 3 2016 6:37 PM

బీసీసీఐపై సుప్రీం ఆగ్రహం - Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డులో మంత్రులు, ప్రభుత్వ అధికారులు ఎలాంటి పదవులు చేపట్టకుండా నిరోధించాలనే జస్టిస్ లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా బీసీసీఐ దాఖలు చేసిన అఫిడవిట్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు బీసీసీఐలో మంత్రులు అవసరం ఏముందని ఘాటుగా ప్రశ్నించింది. బోర్డులోని ఖర్చులపై నివేదిక సమర్పించాలని గురువారం విచారణ సందర్భంగా సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది.


మంగళవారం 60 పేజీలతో కూడిన అఫిడవిట్‌ను బీసీసీఐ బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ సుప్రీంలో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఒక రాష్ర్టం.. ఒక ఓటు’ సూచనపై ఇతర రాష్ట్ర యూనిట్లు అసంతృప్తితో ఉన్నాయన్నారు. మంత్రులు, ప్రభుత్వ అధికారులు ఎలాంటి పదవులు చేపట్టకుండా నిరోధించాలనే ప్రతిపాదన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (సి)ని ఉల్లంఘించినట్టే అవుతుందని ఆఫిడవిట్లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement