ఇద్దరు అర్థ సెంచరీలు చేసినా... | Sakshi
Sakshi News home page

ఇద్దరు అర్థ సెంచరీలు చేసినా...

Published Tue, Feb 17 2015 6:21 AM

ఇద్దరు అర్థ సెంచరీలు చేసినా...

డునెడిన్: న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి స్కాట్ లాండ్ బ్యాట్స్ మన్ తలవంచారు. స్వల్స స్కోరుకే పరిమితమయ్యారు. ప్రపంచకప్ లో భాగంగా మంగళవారం న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్ లాండ్ 36.2 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. కివీస్ ముందు 143 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

మాచన్(56), బరింగ్టన్(50) అర్థ సెంచరీలు చేసినా మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో స్కాట్ లాండ్ తక్కువ స్కోరు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో ఆండర్సన్, వెటోరి 3 వికెట్లు పడగొట్టారు. సౌతీ, బౌల్ట్ రెండేసి వికెట్లు తీశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement