బంతి తగిలి బ్యాట్ వదిలేశాడు | Sakshi
Sakshi News home page

బంతి తగిలి బ్యాట్ వదిలేశాడు

Published Thu, Mar 5 2015 7:32 AM

బంతి తగిలి బ్యాట్ వదిలేశాడు

నెల్సన్: బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో స్కాట్లాండ్ బ్యాట్స్ మన్ బేరింగ్టన్ కు గాయమైంది. మాథ్యూ క్రాస్ కొట్టిన షాట్ నాన్ స్టయికర్ బేరింగ్టన్ కు బలంగా తగిలింది. బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో మాథ్యూ క్రాస్ కొట్టిన బంతి నేరుగా బేరింగ్టన్ ఎడమ చేతికి తగిలింది. మణికట్టు దగ్గర బంతి తగలడంతో అతడు బాధతో బ్యాట్ వదిలేశాడు.

స్కాట్లాండ్ ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించిన తర్వాత మళ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే తర్వాత బంతికే అతడు అవుటయ్యాడు. 16 బంతుల్లో 2 సిక్సర్లు, ఫోర్ తో 26 పరుగులు చేసిన బేరింగ్టన్..తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లోనే పెవిలియన్ చేరాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement