వారిద్దరే మార్చేశారు: గంగూలీ

30 Sep, 2016 19:55 IST|Sakshi
వారిద్దరే మార్చేశారు: గంగూలీ

కోల్ కతా: క్రికెట్ మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, మాథ్యూ హేడెన్ పై టీమీండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరూ టెస్టు క్రికెట్ లో బ్యాటింగ్ నిర్వచనం మార్చేశారని ఓ టాక్ షోలో చెప్పాడు. టెస్టుల్లోనూ వేగంగా పరుగులు సాధించొచ్చని నిరూపించారని పేర్కొన్నాడు.

‘ఆధునిక క్రికెట్ లో ఓపెనర్లు పరుగులు చేయకపోతే విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనికి సెహ్వాగ్, హేడెన్ కారణం. ఎందుకంటే వీరిద్దరూ వేగంగా పరుగులు సాధించేవారు. జస్టిన్ లాంగర్ కూడా వేగంగానే పరుగులు చేసేవాడు. అయితే వీరూ, హేడన్ మాత్రమే టెస్టు క్రికెట్ బ్యాటింగ్ నిర్వచనం మార్చార’ని గంగూలీ వ్యాఖ్యానించాడు.

బాగా ఆడిన ఆటగాడిని ప్రోత్సహించిన వాడే విజయవంతమైన కెప్టెన్ అవుతాడని ఇదే షోలో పాల్గొన్న సెహ్వాగ్ అన్నాడు. ‘గంగూలీ నన్ను ప్రోత్సహించడం వల్లే భయం లేకుండా ఆడేవాడినని. నేను అవుటైనా తర్వాత బ్యాటింగ్ దిగేది ద్రవిడ్, సచిన్, గంగూలీ, లక్షణ్, ధోని లాంటి హేమహేమీ ఆటగాళ్లు కాబట్టి రీలాక్స్ గా ఉండేవాడిన’ని సెహ్వాగ్ వెల్లడించాడు.

మరిన్ని వార్తలు