పుజారా రనౌట్‌పై సెహ్వాగ్‌ పంచ్‌ | Sakshi
Sakshi News home page

పుజారా రనౌట్‌పై సెహ్వాగ్‌ పంచ్‌

Published Sun, Jan 14 2018 8:24 PM

Sehwag responds on Pujara golden duck - Sakshi

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చతేశ్వర పుజారా గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేరిన సంగతి తెలిసిందే. తాను ఎదుర్కొన్న తొలి బంతికే అనవసర పరుగుకోసం యత్నించిన పుజారా రనౌట్‌గా నిష్ర్కమించాడు. భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా మోర్నీమోర్కెల్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ నాల్గో బంతిని ఎదుర్కొన్న పుజారా మిడాన్‌ మీదుగా ఆడాడు. అయితే అదే క్రమంలో రాని పరుగు కోసం ప్రయత్నించాడు.

అవతలి ఎండ్‌ నుంచి మురళీ విజయ్‌ వద్దని వారిస్తున్నా పరుగు కోసం వెళ్లాడు. పరుగు కోసం నాన్‌ స్టైకింగ్‌ వైపు పరుగు పూర్తి చేసే క‍్రమంలో ఎంగిడి నేరుగా విసిరిన త్రో వికెట్లను పడగొట్టడంతో పుజారా భారంగా పెవిలియన్‌ చేరాడు.అయితే పుజారా రనౌట్‌ తర‍్వాత ట్విట్టర్‌ కింగ్‌గా పిలుచుకునే భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ పంచ్‌ వేశాడు. ఆ రనౌట్‌ చేసిన లుంగి ఎంగిడిని టార్గెట్‌ చేస్తూ మన వీరూ సెటైర్‌ వేశాడు.

అద్భుతమైన త్రో విసిరిన లుంగి ఎంగిడి.. తను లుంగీ డ్యాన్స్ చేస్తాడా..? లేక మన బ్యాట్స్‌మెన్ తో లుంగీ డ్యాన్స్‌ చేయిస్తాడా అంటూ ట్వీట్‌ చేశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement