షేన్ వార్న్.. మాట నిలబెట్టుకున్నాడు! | Sakshi
Sakshi News home page

షేన్ వార్న్.. మాట నిలబెట్టుకున్నాడు!

Published Fri, Jun 16 2017 3:39 PM

షేన్ వార్న్.. మాట నిలబెట్టుకున్నాడు!

లండన్: చాంపియన్స్ ట్రోఫీలో తమ జట్టుపై పందెం కాసి ఓడిపోయిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ మాట నిలబెట్టుకున్నాడు. తన  పందెం ప్రకారం ఇంగ్లండ్ జెర్సీని ధరించి కొత్త లుక్ లో దర్శనిమిచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ-ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్ లు చిన్నపాటి పందెం కాసుకున్నారు. ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సౌరవ్-వార్న్లు ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల బలబలాపై పందెం కాసారు. గ్రూప్ స్టేజ్ లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ దే పైచేయి అవుతుందని గంగూలీ పేర్కొనగా, దానికి వార్న్  తమ జట్టే గెలుస్తుందంటూ సవాల్ విసిరాడు.

 

ఆ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓడిపోతే ఆసీస్ జెర్సీ ధరించాలంటూ గంగూలీకి సవాల్ విసిరాడు. ఒకవేళ ఆసీస్ ఓడిపోతే తాను ఇంగ్లండ్ ధరిస్తానని వార్న్ పేర్కొన్నాడు. ఇలా వింతగా కాసుకున్న ఈ పందెంలో  గంగూలీ గెలవగా, వార్న్ ఓడిపోయాడు. పందెం  ప్రకారం ఇంగ్లండ్ గెలిచింది కాబట్టి వార్న్ ఆ జట్టు జెర్సీని ధరించాల్సి వచ్చింది. అయితే ఇంగ్లండ్ జెర్సీ ధరించినందుకు బాధగా ఉందంటూ వార్న్ ట్వీట్ చేశాడు. అయితే పందెం అనేది పందెమే కాబట్టి తప్పని సరి పరిస్థితుల్లో ఇంగ్లండ్ జెర్సీని ధరించాల్సి వచ్చిందని వార్నీ తెలిపాడు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement